
Diabetes Diet | డయాబెటిస్ అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక పరిస్థితి. క్లోమం తగినంత ఇన్సులిన్ తయారు చేయలేనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించలేనపుడు డయాబెటిస్ వచ్చినట్లుగా భావిస్తారు.ఈ రెండూ మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మీకు దీర్ఘకాలికంగా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అది మీ ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Control) అదుపులో ఉంచుకోకపోతే, అది మూత్రపిండాల వ్యాధి, న్యూరోపతి, గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. అలా చేయడానికి ఒక మార్గం మీ ఆహారాన్ని ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఆహారాలు (Diabetes Diet) ఉన్నాయి. మీరు తినే పిండి పదార్థాలు వాటిలో చాలా ముఖ్యమైనవి డయాబెటిస్ ఉన్నవారికి ఉత్తమమైన కొన్ని పిండి పదార్థాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి..

బాదం పిండి (Almond Flour)
ఇది మెత్తగా రుబ్బిన బాదం నుంచి తయారవుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది గ్లూకోజ్ శోషించుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar ) స్థిరీకరించడానికి ఈ బాదం పిండి సహాయపడుతుంది. ఈ పిండి బేకింగ్, పాన్‌కేక్ లు ఇతర వంటల్లో అద్భుతమైన రుచిని అందిస్తుంది.

శనగ పిండి (Chickpea Flour)
శనగ పిండి లేదా బేసన్, భారతీయ వంటశాలలలో ప్రధానమైనది. ఇది ఒక మోస్తరు GI కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, తద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.ఇది పాన్కేక్లు, వడలు, పకోడీ, బజ్జీలు, ఫ్లాట్ బ్రెడ్లకు మంచి ఎంపిక.

ఓట్ పిండి (Oat Flour)
ఈ పిండిని ఓట్స్ తో తయారు చేస్తారు. బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికి మితమైన GI ఉంటుంది. దాని ఆకృతిని మెరుగుపరచడానికి ఇతర పిండితో కలపవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రించేటప్పుడు దీనిని బేకింగ్ కోసం ఉపయోగించవచ్చు.

బార్లీ పిండి (Barley Flour)
ఇది బార్లీ గింజల నుండి తయారవుతుంది. తక్కువ GI కలిగి ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.

బుక్వీట్ పిండి (Buck wheat Flour)
ఈ పిండి గోధుమలకు సంబంధించినది కాదు. గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇది మితమైన GI కలిగి ఉంటుంది ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. బుక్వీట్ పిండి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మంచిది. పాన్కేక్లు, నూడుల్స్ లేదా బేకింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.
Image Credit : vecteezy
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.