
Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నగరంలోని ఐటీ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీని ఈ రైల్వే లైన్ కలుపుతుంది. చివరకు మే 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం సతీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డికె.శివకుమార్ మాట్లాడుతూ, “మే 2025 నాటికి ఎల్లో లైన్ ప్రజా సేవ కోసం ప్రారంభిచంనున్నామని అన్నారు. 2025-26 పూర్తి కోసం పింక్ లైన్ కూడా ట్రాక్‌లో ఉంది.
పింక్ లైన్ (కాలేన అగ్రహార నుంచి నాగవార వరకు 21.2 కి.మీ) కు సంబంధించిన వివరాలను డికె శివకుమార్ పేర్కొన్నారు.
- 7.5 కి.మీ ఎలివేటెడ్ సెక్షన్ (కలేన అగ్రహార నుంచి తవరేకెరె/స్వాగత్ క్రాస్) డిసెంబర్ 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది.
- 13.7 కి.మీ భూగర్భ విభాగం (డైరీ సర్కిల్ నుంచి నాగవార వరకు) డిసెంబర్ 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
రోలింగ్ స్టాక్ కొరత వల్ల ఎల్లో లైన్ పనులు ఆలస్యం అవుతున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) రోలింగ్ స్టాక్ కొరతను ఎదుర్కొంటోంది, దీని కారణంగా ఎల్లో లైన్ ప్రారంభం ఆలస్యం అయిందని
అధికార వర్గాలు తెలిపాయి.
ఎల్లో లైన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి, BMRCL 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో మూడు రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఏప్రిల్ 2025 నాటికి మూడవ రైలును ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు, ఆ తర్వాత నాల్గవ రైలు పూర్తి స్థాయి కార్యకలాపాలకు వీలు కల్పిస్తుంది.
Bengaluru Yellow Line metro : ట్రయల్ రన్
మార్చి 7, 2024న, BMRCL ఎల్లో లైన్ (బొమ్మసాంద్ర-RV రోడ్)లో స్లో ట్రయల్ రన్‌లు ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో, మెట్రో రైల్ సేఫ్టీ (సౌత్ సర్కిల్) కమిషనర్ AM చౌదరి రెండు CRRC నాన్జింగ్ పుజెన్ రైళ్లను తనిఖీ చేశారు – ఒకటి చైనా నుంచి దిగుమతి చేసుకుంది. మరొకటి కోల్‌కతాకు చెందిన టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ ద్వారా అసెంబుల్ చేశారు.
రైల్వే లైన్ జాప్యానికి అనేక కారణాలు
ఇండో-చైనా సరిహద్దు ప్రతిష్టంభన.. సరఫరా గొలుసు సమస్యల కారణంగా జాప్యాలు జరిగాయి. ఎల్లో లైన్ మొదట డిసెంబర్ 2021లో ప్రారంభించాల్సి ఉంది. అయితే, కోచ్ డెలివరీలు అనేక కారణాల వల్ల ఆటంకాలు ఎదుర్కొన్నాయి.. ఇండో-చైనా సరిహద్దు ప్రతిష్టంభన (జూన్ 2020), సరఫరాదారు CRRC నాన్జింగ్ పుజెన్‌ను ప్రభావితం చేసింది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద 75% స్థానిక ఉత్పత్తి అవసరాన్ని తీర్చడానికి స్థానిక భాగస్వామిని గుర్తించడంలో జాప్యం జరిగింది. మరోవైపు COVID-19 అంతరాయాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) విధానాలు, చైనాతో వాణిజ్య పరిమితులు సైతం కారణమ్యాయి. చివరికి, CRRC అవసరమైన మెట్రో కోచ్‌లను తయారు చేసి సరఫరా చేయడానికి టిటాగఢ్ రైల్ సిస్టమ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది, దీనితో ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి వీలు కల్పించింది.
ట్రయల్ రన్‌లు ముమ్మరంగా సాగుతుండడం, రోలింగ్ స్టాక్ సేకరణ చివరి దశలో ఉండడం తదితర పరిణామాల నేపథ్యంలో ఎల్లో లైన్ మే నెలలో ప్రారంభమవుతుందని స్పష్టమవుతోంది. కొత్త రైల్వే మార్గం బెంగళూరు మెట్రో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, ఎలక్ట్రానిక్స్ సిటీ, పరిసర ప్రాంతాలలో వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు రద్దీని తగ్గిస్తుందని నగరవాసులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.