Sunday, April 20Welcome to Vandebhaarath

అక్రమ బంగ్లాదేశ్ వలస విద్యార్థులను గుర్తించండి.. ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు

Spread the love

Bangladeshi migrant students : అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించి, వారికి జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చూసుకోవాలని పాఠశాలలను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఆదేశించింది.

బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను గుర్తించాలని ఢిల్లీ LG సెక్రటేరియట్ సూచించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార AAP, BJP మధ్య వాగ్యుద్ధం మొదలైంది.

READ MORE  Cricket | బంగ్లాదేశ్ టెస్ట్ లో ఇరగదీసిన అశ్విన్.. మెరపు సెంచరీతో ఎంఎస్ ధోని టెస్టు రికార్డు సమం

అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆక్రమణలను తొలగించాలని పౌర సంఘం అన్ని MCD జోన్‌లను ఆదేశించింది. డిసెంబరు 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్‌ ద్వారా యాక్షన్‌ టేకప్‌ రిపోర్ట్‌ను కోరింది.

“మునిసిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ బంగ్లాదేశీ (Bangladesh) వలసదారులను గుర్తించడానికి విద్యా శాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించడానికి సరైన గుర్తింపు, ధృవీకరణ డ్రైవ్‌లను కూడా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కమిషనర్ అన్నారు.

READ MORE  Indian Railways | వేసవిలో ప్ర‌యాణికుల కోసం పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లు..

ఈ ఆదేశాలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ, అక్రమ వలసదారుల పేరుతో పూర్వాంచలి సమాజాన్ని అవమానపరిచేందుకు కుట్ర పన్నుతున్నరాని అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పూర్వాంచాలిలను “రోహింగ్యా చొరబాటుదారులు” బంగ్లాదేశీయులతో” సమానం చేశారని ఆరోపించారు. రోహింగ్యాలు మయన్మార్‌కు చెందిన ముస్లిం మైనారిటీ సమూహం. ఈ ఆదేశాల ద్వారా, వారు పూర్వాంచలీలను, వారి పిల్లలను బెదిరించి, వారి దుకాణాలు, ఇళ్లను బుల్డోజ్ చేయాలనుకుంటున్నారు” అని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.

READ MORE  Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్‌..

కాగా, పూర్వాంచాలిలు తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ నుండి వలస వచ్చినవారు. ఢిల్లీ ఓటర్లలో దాదాపు 42 శాతం ఉన్నారు. బురారీ, లక్ష్మీ నగర్, ద్వారక వంటి కీలక ప్రాంతాలతో సహా ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు సగం మంది జనాభా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *