Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన కేంద్రం.. కారణమిదే..
Ban on OTTs: చాలా ఓటీటీల్లో సెన్సార్ అనేదే లేకుండా అశ్లీలమైన కంటెంట్ విచ్చలవిడిగా పాకిపోతోంది. పూర్తిగా అశ్లీలమైన కంటెంట్ తోనే కొనసాగుతున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కసారిగా 18 ఓటీటీలపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ ఓటీటీలతోపాటు అశ్లీల కంటెంట్ ఉన్న 19 వెబ్ సైట్లు, 10 యాప్ లు 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా వేటు వేసింది .
అశ్లీల కంటెంట్ ఉన్న ఓటీటీలను నిషేధిస్తున్న విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు. నిషేధించిన 18 ఓటీటీల్లో ఒక ఓటీటీ నుంచి ఇప్పటికే కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తేల్చారు. మరో రెండు ఓటీటీల నుంచి 50 లక్షలకుపైగా డౌన్ లోడ్స్ చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఈ ఓటీటీలకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కు మొత్తం 32 లక్షల మంది యూజర్లు ఉన్నారు. 18 ఓటీటీలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అశ్లీలమైన ట్రైలర్లు, వీడియోల ద్వారా నెటిజన్లను ఆకర్షిస్తున్నట్లు సమాచార శాఖ తెలిపింది.
18 ఓటీటీలు ఇవే
Ban on OTTs ప్రభుత్వం వేటు వేసిన యాప్ ల లో.. డ్రీమ్ ఫిల్మ్స్, వూవి, ఎస్మా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, అన్‌కట్ అడ్డా, నియాన్ ఎక్స్ వీఐపీ, బేషరమ్స్, రాబిట్, ఎక్స్‌ట్రామూడ్, హంటర్స్, న్యూఫ్లిక్స్, మోజ్‌ఫ్లిక్స్, మూడ్ఎక్స్, హాట్ షాట్స్ చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే వీఐపీ, ఫుజి వంటి ఓటీటీలు ఉన్నాయి.
ఓటీటీలు, యాప్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం విధించిన తర్వాత సమాచార శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలోని కంటెంట్ చాలా వరకూ అశ్లీలమైనదేనని తెలిపింది. “ఈ ప్లాట్‌ఫామ్స్ పై ఉన్న కంటెంట్ లో చాలా వరకూ అశ్లీలమైనదేనని, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ కంటెంట్ లైంగిక చర్యలను చాలా తప్పుడు విధానంలో చూపించాయని, టీచర్లు, విద్యార్థుల మధ్య లైంగిక సంబంధాలు, కుటుంబాల్లో అక్రమ సంబంధాలు వంటివి ఇందులో ఉన్నట్లు గుర్తించామని, అందుకే వీటిని నిషేధిస్తున్నట్లు అని సమాచార శాఖ వెల్లడించింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..