Ayodhya railway station | ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య స్టేషన్ ఎలా ముస్తాబైందో చూడండి..
Ayodhya : రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్యలోని రైల్వేస్టేషన్ (Ayodhya railway station) అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలు, కొత్త సైన్ బోర్డులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, గోడలపై చిత్రీకరించిన రాముడి చిత్రాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
జనవరి 22న జరగనున్న రామాలయ మహా ప్రతిష్ఠాపనకు ముందు ఆలయ పట్టణానికి తరలివస్తున్న పర్యాటకులు రైల్వే స్టేషన్ లో.. సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
వచ్చే నెల సంప్రోక్షణ మహోత్సవానికి ముందుగా ప్రధాని మోదీ డిసెంబర్ 30న ఆలయ పట్టణాన్ని సందర్శించనున్నారు.
దిల్లీకి చెందిన పర్యాటకుడు పురుషోత్తం మాట్లాడుతూ.. కొత్తగా ఆధునికీకరించిన రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, సందర్శకుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. రైల్వేస్టేషన్ మొత్తం హిందూ పురాణాలను ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పారు.
“మేము మొదటిసారి ఇక్కడికి వచ్చాము.. మేము రైల్వే స్టేషన్ (Ayodhya railway station) కి కాకుండా విమానాశ్రయానికి చేరుకున్నామా అన్న భావన కలిగింది. ఈ స్టేషన్ లో ఆధునిక సౌకర్యాలు మాత్రమే కాకుండా హిందూ పురాణాల స్పర్శ కూడా ఉంది,” అని ANI కి వెల్లడించారు.
అయోధ్యను సందర్శంచిన మరో వ్యక్తి రామనారాయణ దాస్ జీ మహారాజ్ కూడా.. పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు సందర్శకులకు అత్యున్నతమైన సేవలను అందిస్తుందని చెప్పారు.
“ఇది కొత్త డిజైన్ తో చాలా అందంగా కనిపిస్తుంది. భగవాన్ రాముడు కూడా స్టేషన్ ను బాగా పునరుద్ధరించాలని కోరుకున్నాడు, పవిత్రోత్సవం కోసం పెద్ద ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అని తెలిపారు. తిరువనంతపురం నుంచి వచ్చిన సందర్శకుడు స్వామి సాయి ప్రసాద్ సరస్వతి మాట్లాడుతూ, “అయోధ్య చాలా అందంగా ఉంది. పవిత్రోత్సవానికి ముందు ప్రజలు తండోపతండాలుగా నగరానికి చేరుకుంటున్నారు.”
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి రెండు దశల్లో జరుగుతోంది. మొదటి దశలో ప్లాట్ ఫారమ్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. రెండో దశలో అదనపు మరుగుదొడ్లు, డార్మిటరీలు, టికెటింగ్, సర్క్యులేటింగ్ ప్రాంతాలతో సుందరీకరణ, ప్రగతి పనులు చేపడుతున్నారు.
అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ సుమారు 50,000-60,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. రెండో దశ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.
“రామ మందిరం ముఖభాగాన్ని తలపించే విధంగా రైల్వే స్టేషన్ ను పునరుద్ధరిస్తున్నాం. ఇది అయోధ్య నగరానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను కూడా ప్రతిబింబిస్తుంది. ఇది బయటి నుంచి ఆలయాన్ని పోలి ఉన్నప్పటికీ, ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇది అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నాం. ఇది ఇప్పటికే 50,000-60,000 మంది ప్రయాణికుల సర్క్యులేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేము ప్రాజెక్ట్ మొదటి దశలో మాత్రమే ఉన్నాము. రెండవ దశలో పని త్వరలో ప్రారంభమవుతుంది.” అని నితిష్ కుమార్ మీడియాకు వివరించారు.
#WATCH | Visuals of the newly redeveloped #Ayodhya railway station have emerged ahead of the grand consecration ceremony of the #RamTemple, scheduled to be held on January 22, 2024
📹 ANI pic.twitter.com/Gp8EUVbZHh
— Hindustan Times (@htTweets) December 25, 2023
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
👍👍👍
👍