మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు… పోలీసుల ఎంకౌంటర్ లో హతం..
1 min read

మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు… పోలీసుల ఎంకౌంటర్ లో హతం..

Spread the love

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో మహిళా కానిస్టేబుల్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్..  పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయోధ్యలోని పురా కలందర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు చనిపోగా ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులునిందితులు ఆజాద్, విషంభర్ దయాల్‌లను ఇనాయత్ నగర్‌లో అరెస్టు చేశారు.

మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారని, ఆమె వారిని అతికించిందని నిందితులు తెలిపారు. దీని తర్వాత, వారు సామూహికంగా మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి, ఆమె తలను కిటికీ కేసి కొట్టి పగులగొట్టారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగా.. వారు ఆమెను బెర్త్ కిందకు నెట్టివేశారు… అనంతరం  అయోధ్యలో రైలు పూర్తిగా ఆగకముందే ముగ్గురు నిందితులు పారిపోయారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *