Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..
Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్ కరకరలాడే పూరీ, అద్భుతమైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు, బెంగుళూరులో ఆటోమేటిక్ పానీ పూరీ వెండింగ్ మెషీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ Pani-Puri వెండింగ్ మెషీన్ ఫొటో బెంగళూరులోని హోసూర్-సర్జాపూర్ రోడ్ లేఅవుట్‌లో తీశారు. దీనిని ప్రముఖంగా హెచ్‌ఎస్‌ఆర్ అని పిలుస్తారు. ఇది మొదట @benedictgershom అనే ‘X’ ఎకౌంట్ నుంచి షేర్ అయింది. చాలా మంది నెటిజన్లు ఈ స్టాల్ ఉన్న ప్రదేశం గురించి ఆరా తీశారు. దానికి వినియోగదారుడు సెక్టార్ 6లోని హెచ్‌ఎస్‌ఆర్ హై స్ట్రీట్‌లో ఉందని బదులిచ్చారు.
వినియోగదారు షేర్ చేసిన ఫొటోను పరిశీలిస్తే.. ఈ యంత్రం ‘WTF – వాట్ ది ఫ్లేవర్’ అనే కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోంది. యంత్రాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా, కొంతమంది స్టాల్ ‘చాలా క్లినికల్’గా కనిపించిందని చెప్పారు.
“బెంగళూరులో మాత్రమే” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అయితే, కొంతమంది స్ట్రీట్ ఫుడ్ అందించే ఈ వెండింగ్ మెషీన్‌ను చూడటం ఇదే మొదటిసారి కాదని పోస్ట్ చేశారు.
“…ఈ యంత్రాన్ని దశాబ్దం క్రితం చమ్‌రాజ్‌పేట దగ్గర చూశాను,” అని @thrishul అనే నెటిజన్ చెప్పారు.
రెండు నెలల క్రితం హోస్‌పేట నగరంలో ఇలాంటి యంత్రాన్ని చూశామని మరో వ్యక్తి తెలిపారు. మరో నెటిజన్ ఈ యంత్రంపై చురకలంటించారు.. “ఇది ఫ్లాప్ అవుతుంది. పానీ పూరీలో విక్రేత చెమట పడకుండా ఎవరూ ఇష్టపడరు, ”అని పేర్కొన్నారు.
Pani-Puri పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇదిలా వుండగా కర్ణాటక రాష్ట్రంలోని స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో పానీ పూరీ రసంలో క్యాన్సర్ కారకాలను ఉపయోగించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు జూలై మొదటి వారంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నివేదికల ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారులు, షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలతో సహా వివిధ ప్రాంతాల నుండి 200 పైగా పానీ పూరీ నమూనాలను సేకరించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..