నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు
తమిళనాడులో దారుణం
చెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని అంబత్తూరులోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కమేష్ (25)గా
గుర్తించారు. ఆటోరిక్షా అతని స్నేహితుడిది. ఈ దాడిలో కమేష్ సోదరుడు సతీష్ (29) కూడా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. గత గురువారం రాత్రి కామేష్ తన సోదరుడిని అంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇంటిలో దింపేందుకు ఒరగడమ్‌కు వెళ్తున్నాడు. రాత్రి 11.30 గంటల
ప్రాంతంలో అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్‌లో కామేష్ ఆటో నడుపుతుండగా అక్కడ పది మందితో కూడిన గుంపు బర్త్ డే కేక్‌ను కట్ చేస్తోంది. రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో కామేష్ చాలా సేపు హారన్ మోగించాల్సి వచ్చింది. అతను నిరంతరాయంగా హారన్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఠా కామేష్‌తో వాగ్వాదానికి దిగింది. వేడుకలు పూర్తయ్యే వరకు ఆగాలని ఆదేశించారు.
కమేష్ అతని సోదరుడు దీనిని వ్యతిరేకించడంతో పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్‌తో పాటు మరికొందరు కమేష్‌ను కత్తులతో పొడిచారు. అతడిని రక్షించేందుకు సతీష్‌పై కూడా దాడి జరిగింది. సతీష్ ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసినా, అప్పటికే ఆ ముఠా కమేష్‌ను కత్తితో పలుమార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కమేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సతీష్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ దారుణ హత్యతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.? రోడ్డుపై ఇలాంటి వేడుకలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అంబత్తూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి గౌతం (22), నవీన్‌కుమార్(18)లను పట్టుకున్నారు. అజయ్(22), రియాజ్(19 ), కతిరేసన్(23), సూర్య(19 ) తోపాటు మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దారుణం