AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బలపడి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని కారణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది . నెల్లూరుకు సమీపంలో తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంద తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈనెల 17వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద మంగళవారం సముద్రపు కెరటాలు 5 మీటర్లు ఎత్తుకు ఎగసి పడ్డాయి. దాదాపు 8 నుంచి 10 మీటర్లు వరకు సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గుర అవుతోంది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాలని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..