Mega DSC 2024 : మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీని ప్రకటించే చాన్స్ ఉంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ .జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదల చేయనున్నారు.
విభాగాల వారీగా చూస్తూ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
- సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) పోస్టులు 6,371
- స్కూల్ అసిస్టెంట్లు (SA) పోస్టులు 7,725
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు 1781
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు 286
- వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (PET) 132
- ప్రిన్సిపాల్ పోస్టులు 52
ఏపీ టెట్ (AP TET) జులై-2024 పరీక్షలకు సంబంధించిన పలు కీలక వివరాలను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఆన్సర్ కీలు ఉన్నాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. కాగా జూలైలో నిర్వహించిన టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,68,661 మంది హాజరయ్యారు. మొత్తం 17 రోజల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరిగాయి. టెట్ తుది ఆన్సర్ ‘కీ’ అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. టెట్ ఫలితాలు నవంబర్ 2న ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..