Saturday, April 19Welcome to Vandebhaarath

Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?

Spread the love

Annamalai Biopic | యూపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన అన్నామలై అంచలంచలిగా ఎదిగి నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పోలీసు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వ అధికారిగా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నాకూడా వారి పై స్థాయి అధికారికి తలవంచి పనిచేయాల్సిందే.. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు అన్నామలై.. . ఒకప్పటి డైనమిక్ పోలీస్ సింగం..ఇప్పుడు అసంఖ్యమైన అభిమానులను సంపాదించుకున్నయువ రాజకీయవేత్తగా అన్నామలై మారిపోయారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను కలిగిన అన్నామలై జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విశాల్ కృష్ణ తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై పాత్రను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. “విశాల్ తెరపై అన్నామ‌లై పాత్ర‌లో నటించడానికి ఆమోదం తెలిపాడు,” అని నివేదిక‌లు చెబుతున్నాయి.”బిజెపి నాయకుడు అన్నామలై తమిళనాడులో అధికార డిఎంకె నాయకులపై కుండబద్దలు కొట్టడం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడటం ద్వారా ప్ర‌జ‌ల్లో త‌క్కువ కాలంలోనే బాగా పాపుల‌ర్ అయ్యారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించిన నిఖార్సైన ఐపీఎస్ అధికారిగా అన్నామ‌లై జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందారు.

READ MORE  Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

39 ఏళ్ల అన్నామలై తమిళనాడులో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కోయంబత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి డీఎంకేకు చెందిన గణపతి పి రాజ్‌కుమార్‌, ఏఐఏడీఎంకే అభ్యర్థి రామచంద్రన్‌తో పోటీపడ్డారు. “ అన్నామ‌లై మొద‌ట‌ కర్ణాటకలో పోలీసు అధికారిగా త‌న మార్క్ ను చూపించారు. ఆ త‌ర్వాత త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు.
2026లో తమిళనాడులో కాషాయ‌ పార్టీని అధికారంలో తీసుకురావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఖచ్చితంగా అతని జీవిత కథ యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, అయితే నటుడు విశాల్ ‘పందెం కోడి,’, ‘పరుగు, ‘మార్క్ ఆంటోని’ వంటి యాక్షన్-సెంట్రిక్ సినిమాలతో గుర్తింపు పొందారు. అతని ఇటీవల విడుదలైన ‘రత్నం. ప్ర‌స్తుతం విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. అన్నామలై బయోపిక్‌ (Annamalai Biopic)లో, విశాల్ మొదటి భాగంలో కఠినమైన పోలీసుగా కనిపిస్తాడు. తరువాత పాలక వ్యవస్థపై దాడి చేస్తూ.. ఫైర్‌బ్రాండ్ రాజకీయ నాయకుడిగా క‌నిపించ‌నున్నారు.

READ MORE  రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?

అన్నామలై గురించి ముఖ్యాంశాలు..

  • 39 ఏళ్ల అతను 2021లో తమిళనాడులో అతి పిన్న వయస్కుడైన బీజేపీ అధ్యక్షుడయ్యాడు.
  •  అన్నామలై 2020లో బీజేపీలో చేరారు. యువతకు అన్నామలై త‌క్కువ స‌మ‌యంలోనే చేరువ‌య్యారు. తమిళనాడులో బీజేపీ పట్టు సాధిస్తూ.. వేగంగా శ్రేణుల్లో ఎదిగారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
  • కర్ణాటక కేడర్‌కు చెందిన 2011-బ్యాచ్ IPS అధికారి, అన్నామలై చిక్కమగళూరు, ఉడిపి జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌గా ప‌నిచేశారు. బెంగళూరు (దక్షిణం)లో డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా కూడా విధులు నిర్వ‌ర్తించారు.
  • అన్నామలై సెప్టెంబరు 2019లో పోలీసు స‌ర్వీస్ నుంచి వైదొలిగారు.
  • అన్నామలై IIM-లక్నో నుండి MBA చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.
  • పోలీస్ ఫోర్స్‌లో పనిచేసిన సమయంలో, అన్నామలై తన పని తీరు కారణంగా ‘సింగం అన్న’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.
  • అన్నామలైని ఉడిపిలో ప‌నిచేస్తున్న‌పుడు ఇస్లాంను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు మత పండితుల సహాయంతో ఖురాన్, హదీథ్‌లను అధ్యయనం చేశానని చెప్పారు.
  •  అన్నామలై పోలీసు ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారు.? ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, 2018లో కైలాష్ మానస సరోవర్ యాత్ర తన జీవితాన్ని తిరిగి చూసుకునేలా చేసిందని అన్నామలై తన రాజీనామా లేఖలో రాశారు.
  • 2023లో అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా ఎన్ మన్ ఎన్ మక్కల్ (నా భూమి, నా ప్రజలు) యాత్రకు నాయకత్వం వహించారు.
  • అన్నామలైను బీజేపీ వర్ధమాన తారగా గుర్తింపు పొందారు. అతని వాగ్ధాటికి త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. , అతని ప్రసంగాలు తరచుగా వైరల్ అవుతాయి
READ MORE  Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *