Friday, March 14Thank you for visiting

Andhrapradesh

టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

Andhrapradesh
విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు.మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?