Saturday, August 30Thank you for visiting

Andhrapradesh

దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మ‌ల్ల‌న్న‌కు..  హైదరాబాద్​ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!

దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మ‌ల్ల‌న్న‌కు.. హైదరాబాద్​ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!

Andhrapradesh, Telangana
Elevated Corridor Srisailam : ప్ర‌సిద్ధ‌ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. హైదరాబాద్​ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండ‌లు, ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపులు దాడుకుని వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. హైదరాబాద్​ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపుల మ‌ధ్య‌ వాహనాల‌ వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాట‌డానికి వీలు లేదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిన ప‌రిస్థితి. పైగా రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. మ‌రోవైపు ద‌ట్ట‌మైన కీకార‌ణ్యం మ‌ధ్య సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు విముక్తి క‌ల్పించేందుకు తెలంగాణ స‌ర్కారు కొత్త ప్రతిపాదన చేసింది. 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన (Elevated Corridor Srisailam Highway) ను నిర...
Tirupati laddoo row : తిరుమ‌ల‌కు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు

Tirupati laddoo row : తిరుమ‌ల‌కు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు

Andhrapradesh
Tirupati laddoo row | తిరుపతి లడ్డూలలో కల్తీపై దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్‌ (AR Dairy Foods) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయానికి కల్తీ నెయ్యి ట్యాంకర్లను సరఫరా చేసిన స‌ద‌రు కంపెనీ క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ పోలీసులను అభ్యర్థించింది. తిరుపతి లడ్డూ (Tirumala laddu)ల నాణ్యతపై పలువురు భ‌క్తులు ఫిర్యాదు చేశారని, ఆవు నెయ్యి కొనుగోళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని టీటీడీ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భక్తులకు అందించే ప్రసిద్ధ తిరుపతి ప్రసాదం తయారీలో బీఫ్ టాలో, చేప నూనె, పంది కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు నివేదికలు సూచించడంతో లడ్డూలపై వివాదం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ప్రసాదం నుంచి ఎప్పుడూ లేని వాసన వస్తోందని భక్తులు ఫిర్యాదు చేయడంతో లడ్డూల్లో కల్తీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స...
Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Andhrapradesh
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఆల‌యానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ స‌ర‌ఫ‌రా చేసిన‌ నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపించ‌గా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో కేంద్రం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్య‌వ‌హారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌...
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై  రంగంలోకి దిగిన కేంద్రం..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..

Andhrapradesh
Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. తాము నిర్వహించిన ఐదు పరీక్షల్లో పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, పామాయిల్ తదితరాలను ఉప‌యోగించిన‌ట్లు తేలిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు లడ్డూల నాణ్యత నాసిర‌కంగా మారింన్నారు.ఇదిలా ఉండ‌గా, చంద్రబాబు నాయుడు టీడీపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా లడ్డూల్లో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ పంచుకున్న ల్యాబ్ రిపోర్టు జూలై నాటిదని, అది నయీం హయాంలోనిదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు.కల్తీని అంగీకరించిన టీటీడీకాగా తిరుమల...
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు

Andhrapradesh
Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఏడు జాతీయ రహదారుల‌ ప్రాజెక్టులు ఈ  విధంగా ఉన్నాయి.కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి.National Highway Projects in Andhra Pardesh ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇతరులతో సమన్వయం చేసుకుని ఈ నిధుల సేకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని జ‌నార్ద‌న్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గతంలో భారత్ మాల ప్రాజెక్ట...
జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Andhrapradesh
Sanatana Dharma Rakshana Board | తిరుమ‌ల‌ లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల‌ కొవ్వును వినియోగించార‌నే వార్త‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే సనాతన ధర్మ రక్షణ బోర్డు  ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించ‌డంతో మేమంతా చాలా షాక్ కు గుర‌య్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు....
Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..

Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..

Andhrapradesh
Tirumala Laddu Controversy | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం.. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావ‌న క‌లుగుతుంది. అందులో తిరుమ‌ల లడ్డూ అనగానే అంద‌రికీ ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా, ప్ర‌తీక‌ర‌మైన‌దిగా భావిస్తారు. అద్భుత‌మైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచ‌ల‌నం గా మారింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా దుమారం రేపుతోంది.చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నిత‌ప్పుబ‌ట్టారు. విషప్రచారం చేస్తే స్వామి...
Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు…

Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు…

Andhrapradesh
Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌యాణించేవారికి శుభ‌వార్త‌.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇకపై రాజధాని రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 5 గంటల్లోనే చేరుకోనున్నారు. ఇందుకోసం రైల్వే బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఇది డిసెంబర్ 2022 నుండి శనివారాలు మినహా వారానికి ఆరు రోజులు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ రైలు సేవ‌లందిస్తోంది. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు మార్గం బిలాస్‌పూర్-నాగ్‌పూర్ వందేభారత్ తర్వాత మ‌రో రెండో రైలును కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 15 న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప‌లు ...
AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Andhrapradesh
AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీని కార‌ణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉంద‌ని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది.సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తూర్పుగోదావర...
Tirupati Laddu | హైదరాబాద్‌లో ప్ర‌తిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

Tirupati Laddu | హైదరాబాద్‌లో ప్ర‌తిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

Andhrapradesh
Tirupati Laddu | హైదరాబాద్‌: వేంక‌టేశ్వ‌ర‌స్వామి భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి వేద స్థానం (TTD) తీపిక‌బురు చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ (Tirupati Laddu ) విక్రయించగా ఇక‌పై ప్ర‌తీరోజు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు. ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ప్ర‌తిరోజూ అందుబాటులో ఉంటుందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.స్వామివారి లడ్డూ విక్ర‌యాల్లో లో తితిదే కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన లడ్డూ ప్రసాదం (రూ.50కి ఒక లడ్డూ) ఇక నుంచి ప్ర‌తీరోజూ అందజేయాలని నిర్ణ‌యించారు.రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్ ఆలయాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతున్నారు. తి...