Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు.
Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్‌లను మొత్తం రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ శాటిలైట్ టెర్మినల్ గా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మార్చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల్లో ప్రధానమైన అభివృద్ధి పనులతో పాటు, ప్రస్తుతం కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ జంక్షన్లపై భారం తగ్గించేందుకు చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ త్వరలో అందుబాటులో వస్తోంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కల్పిస్తున్న సౌకర్యాలు ఇవే..
- రైల్వేస్టేషన్ల ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ఎంట్రెన్స్..
- రైల్వే స్టేషనుకు వెళ్లే రోడ్లను విస్తరించి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం
- మెరుగైన డ్రైనేజీలు, బాటచారుల కోసం ప్రత్యేక మార్గాలు, సరైన పార్కింగ్ ప్రదేశం, లైటింగ్
- స్టేషను ఆవరణలో గ్రీనరీ పెంచడం, ల్యాండ్ స్కేపింగ్
- ప్రయాణికులకు ఆహ్లాదకర అనుభూతిని చేకూర్చేందుకు స్థానిక కళలు, సంస్కృతికి ప్రాధాన్యతనివ్వడం
- ‘‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’’ పథకం కింద స్టాళ్లను ఏర్పాటు చేయడం.
- సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా స్టేషన్ భవనం, ప్రాంగణానికి రెండవ ప్రవేశాన్ని ఏర్పాటు చేయడం
- ఎక్కువ ఎత్తున్న ప్లాట్ఫారంల నిర్మాణం, సరిపడే విధమైన షెల్టర్ల నిర్మాణం.
- పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్ఈడి స్టేషన్ నేమ్ బోర్డులు, వెయిటింగ్ హాళ్ల అభివృద్ధి, సైనేజీల ఏర్పాటు
- స్టేషన్లను ‘సిటీ కేంద్రాలు ‘గా మార్చడం.
- నగరానికి రెండు వైపుల అనుసంధానం
- స్టేషన్ భవనాల పునరాభివృద్ధి.
- ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్.
- స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేపింగ్, గ్రీనరీ, స్థానిక కళలు, సాంస్కృతిక చిహ్నాలు.
తెలంగాణ – అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద స్టేషన్ల జాబితా..
- సికింద్రాబాద్ 700.00 కోట్లు
- హైదరాబాద్ 309.00 కోట్లు
- ఆదిలాబాద్ 17.80 కోట్లు
- భద్రాచలం రోడ్ 24.40 కోట్లు
- హఫీజ్ పేట్ 26.60 కోట్లు
- హైటెక్ సిటీ 26.60 కోట్లు
- ఉప్పుగూడ 26.81 కోట్లు
- జనగామ 24.50 కోట్లు
- కామారెడ్డి 39.90 కోట్లు
- కరీంనగర్ 26.60 కోట్లు
- కాజీపేట జంక్షన్ 24.45 కోట్లు
- ఖమ్మం 25.40 కోట్లు
- మధిర 25.40 కోట్లు
- మహబూబ్ నగర్ 39.87 కోట్లు
- మహబూబాబాద్ 39.72 కోట్లు
- మలక్ పేట 36.44 కోట్లు
- మల్కాజిగిరి 27.61 కోట్లు
- నిజామాబాద్ 53.30 కోట్లు
- రామగుండం 26.49 కోట్లు
- తాండూరు 24.40 కోట్లు
- యాదాద్రి 24.45 కోట్లు
- జహీరాబాద్ 24.35 కోట్లు
- బాసర 11.33 కోట్లు
- బేగంపేట 22.57 కోట్లు
- గద్వాల్ 9.49 కోట్లు
- జడ్చర్ల 10.94 కోట్లు
- మంచిర్యాల్ 26.49 కోట్లు
- మెదక్ 15.31 కోట్లు
- మేడ్చల్ 8.37 కోట్లు
- మిర్యాలగూడ 09.50 కోట్లు
- నల్గొండ 09.50 కోట్లు
- పెద్దపల్లి 26.49 కోట్లు
- షాద్‌నగర్ 9.59 కోట్లు
- ఉమ్దానగర్ 12.37 కోట్లు
- వికారాబాద్ 24.35 కోట్లు
- వరంగల్ 25.41 కోట్లు
- యాకుత్ పురా 8.53 కోట్లు
- బాల బ్రహ్మేశ్వర జోగులాంబ 6.07 కోట్లు
మొత్తం స్టేషన్లు: 38 స్టేషన్లు మొత్తం ఖర్చు: రూ. 1830.4 కోట్లు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు