Amrit Bharat Station Scheme | అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూడండి..
Begumpet | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme ) కింద తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్‌లో ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘‘తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఊహించిన మార్పు రూపుదిద్దుకుంటోంది. ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్ ముందు ద్వారం ఆకర్షణీయంగా కనిపించనుంది , అలాగే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి ”అని మంత్రిత్వ శాఖ X లో సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఇది కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.
స్టేషన్ కోడ్ BMT కలిగిన బేగంపేట రైల్వే స్టేషన్ లో రెండు ప్లాట్‌ఫారమ్‌లు, రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది . ఇది పూర్తిగా విద్యుద్దీకరించబడింది. బేగంపేట్ స్టేషన్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు.. దీర్ఘకాల ప్రణాళికపై దృష్టి సారించి సిటీ సెంటర్‌గా పనిచేస్తాయని అభివృద్ధి చెందిన స్టేషన్ ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు చెబుతున్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ గతే ఏడాది ఆగస్టు 6న తెలంగాణ వ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 15, మహారాష్ట్రలో 13, కర్ణాటకలో ఒక స్టేషన్‌కు కలిపి దాదాపు రూ.2,079.29 కోట్లతో పనులు ప్రారంభించారు.
శరవేగంగా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ
ఇదిలా ఉండగా ఇదే పథకం (Amrit Bharat Station Scheme ) కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నవీకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి కూడా వస్తుంది. సికింద్రాబాద్ జంక్షన్ NSG–1 కేటగిరీ భారతీయ రైల్వే స్టేషన్.. ఇది తెలంగాణాలోని హైదరాబాద్‌లో ప్రధాన రైల్వే స్టేషన్. ఇందులో 10 ప్లాట్‌ఫారమ్‌లు, 11 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో , ఇది అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. 1874లో బ్రిటిష్ హయాంలో హైదరాబాద్ నిజాం దీనిని నిర్మించారు. 1951లో ఈ స్టేషన్‌ను భారతీయ రైల్వేలు స్వాధీనం చేసుకున్నాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..