Amit shah on POK | పీవోకేలో ప్రతీ అంగుళం భారత్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన
Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. కాగా పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మనం గౌరవించాలని మణిశంకర్ అయ్యర్ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూటమి నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై అమిత్ షా స్పందిస్తూ నేను కాంగ్రెస్, భారత కూటమికి చెప్పాలనుకుంటున్నాను పీఓకే భారత్‌కు చెందినది, దానిని ఏ శక్తీ లాక్కోలేదు’’ అని జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు.
కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన, “కాంగ్రెస్‌కు ఏమైందో నాకు తెలియదు. పీఓకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కానీ మీరు (కాంగ్రెస్) ఇప్పుడు పీఓకేపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలోని ప్రతీ అంగుళం భారత్‌కే చెందుతుందని తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ఇండి కూటమి అవినీతిలో మునిగిపోయిందని అన్నారు.
Char Dham Yatra schedule | భక్తుల కోసం తెరుచుకున్న చార్ ధామ్ యాత్ర, షెడ్యూల్ ఇదే..
“JMM నేతృత్వంలోని కూటమి ₹ 300-కోట్ల భూ కుంభకోణం, ₹ 1,000-కోట్ల మైనింగ్ స్కామ్, ₹ 1,000-కోట్ల MNREGA స్కామ్ ₹ 40-కోట్ల మద్యం కుంభకోణంలో మునిగిపోయింది. మేము JMM నేతృత్వంలోని కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతామని అమిత్ షా అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ 70 ఏళ్లుగా అడ్డంకులు సృష్టించిందని, అయితే ప్రధాని మోదీ ఐదేళ్లలో గుడి కట్టారని.. రాహుల్ బాబా తన ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర శంకుస్థాపనకు రాలేదని తెలిపారు. కాంగ్రెస్ తన హయాంలో గిరిజనుడిని రాష్ట్రపతి పదవి ఎందుకు ఇవ్వలేదో రాహుల్ గాంధీ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..