
మావోయిస్టులు వెంటనే హింసాకాండను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్‌లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు. అనంతరం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కు భారత్ తన శక్తి ఏమిటో చూపిందని అన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని, నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ వదిలేసి లొంగిపోవాలని, నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. . ఇప్పటివరకు 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా పేర్కొన్నారు.
Amit Shah : తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..
తెలంగాణ రాష్ట్రంలో లో బిజెపి (BJP) అధికారంలోకి వచ్చితీరుతుందని అమిత్ షా అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బిజెపి విజయం ఖాయమైందని స్పష్టమవుతోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌కు పసుపు బోర్డు సాధించారని, పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ (Nizamabad) లోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు (Turmeric Board) కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుంది. పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని అమిత్ షా వివరిచారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటవుతున్నాయి. భారత్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌తో నిజామాబాద్ పసుపు అమెరికా(US), యూరప్‌కు ఎగుమతి అవుతుందని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.