Friday, April 18Welcome to Vandebhaarath

Amazon Great Indian Festival: బజాజ్ చేతక్‌ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం?

Spread the love

Amazon Great Indian Festival | దేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్‌లను ఆక‌ట్టుకునేలా అనేక అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, గృహోప‌క‌ర‌ణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఇటీవ‌లఎల‌క్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కంపెనీల అమెజాన్ లో భాగ‌స్వాముల‌య్యాయి. ఇప్పుడు అమెజాన్ లో అనేక ఈవీ స్కూట‌ర్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ నెల బజాజ్ ఆటో (Bajaj Auto) కు అద్భుతమైనది, ఎందుకంటే ఆ కంపెనీ EV మార్కెట్‌లో రెండవస స్థానంలో ఉన్న TVS Motors ను వెన‌క్కి నెట్టి అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. అయితే ప్ర‌స్తుతం బజాజ్ చేతక్ పై అనేక డిస్కౌంట్ ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) లో  బజాజ్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ – స్పెషల్ ఎడిషన్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ – స్పెషల్ ఎడిషన్‌పై అమెజాన్ ఏకంగా రూ.7,000 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌లో రూ.1,33,501 ధ‌ర‌కు లభిస్తుంది, అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూట‌ర్ MRP ధ‌ర రూ 1,40,444. Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్, నో కాస్ట్ EMI స్కీమ్ ల‌తో కస్టమర్ మూడు నెలల EMI ప్లాన్‌కు రూ. 3,480 తగ్గింపు, ఆరు నెలల చెల్లింపు సైకిల్‌కు రూ. 6,011 పొందుతాడు. మీరు మీ క్రెడిట్ కార్డ్‌లో మొత్తం ఒకేసారి చెల్లిస్తే, అమెజాన్ ఫ్లాట్ రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది.

READ MORE  Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..

బజాజ్ చేతక్ బ్లూ 3202

బజాజ్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ – స్పెషల్ ఎడిషన్ 3.2 kWh బ్యాటరీతో 4.2 kW (5.6 bhp) అవుట్‌పుట్ శ‌క్తితో న‌డుస్తుంది. ఇది గంట‌కు, 73 km గ‌రిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్క‌సారి చార్జి చేస్తే 136 కిమీ వ‌ర‌కు రేంజ్ ఇస్తుంది. ఇక చార్జింగ్ విష‌యానికొస్తే 3 గంటల 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

బజాజ్ చేతక్ 2903

బ‌జాజ్ చేతక్ 2903 అనేది బజాజ్ ఆటో EV లైనప్ లో ఎంట్రీ-లెవల్ మోడల్. చేతక్ 2903 రూ. 99,998కి అందుబాటులో ఉంది. ఇది బజాజ్ ఆటో వెబ్‌సైట్‌లో అధికారిక ధరకు సమానం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఆఫ‌ర్ కింద‌ రూ. 4,503 వరకు తగ్గింపును అందించడం ద్వారా డీల్‌ను మరింత స‌ర‌స‌మైన‌దిగా మారింది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకుంటారా? ఇది Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ మరియు ఫ్లెక్సిబుల్ నో కాస్ట్ EMI స్కీమ్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్ ఒక నెల EMI ప్లాన్‌ని ఎంచుకుంటే రూ. 2,607 తగ్గింపు, ఆరు నెలల ప్లాన్‌లో స్కూటర్ తీసుకుంటే రూ. 4,503 తగ్గింపు లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ 99,999 రూపాయలతో కొనుగోలు చేస్తే 4,000 రూపాయల తగ్గింపును అందిస్తోంది.

READ MORE  BIS raids | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులపై బిఐఎస్ దాడులు.. 10,000 కి పైగా గుర్తింపులేని వస్తువులు స్వాధీనం

చేతక్ 2903 స్పెసిఫికేష‌న్లు ఇలా ఉన్నాయి. ఇది 63 kmph గరిష్ట వేగంతో 3 kW (4 bhp) అవుట్‌పుట్‌తో 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కిమీ ప్ర‌యాణిస్తుంది. అలాగే 4 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  Maruti Suzuki Dzire | చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన డిజైర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *