Amarnath Yatra 2024 | అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే మీకో శుభ‌వార్త‌..

Amarnath Yatra 2024 | అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే మీకో శుభ‌వార్త‌..

Amarnath Yatra 2024 : ఉత్తర భారతంలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం అమర్‌నాథ్ యాత్ర చేయాల‌ని చాలా మంది కోరుకుంటారు. అయితే అమ‌ర్ నాథ్ కు వెళ్లాల‌నుకునేవారికి రిజిస్ట్రేష‌న్లను ఏప్రిల్ 15న‌ జీ పుణ్యక్షేత్రం బోర్డు ( Amarnathji Shrine Board ) ప్రారంభించింది. “అమర్‌నాథ్‌ యాత్ర 2024 షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది, ఇది జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియ‌నుంది.

సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో రాజధాని శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ పవిత్ర క్షేత్రానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు సంద‌ర్శిస్తుంటారు. జూలై-ఆగస్టు (హిందూ క్యాలెండర్‌లో శ్రావణ మాసం)లో ‘శ్రావణ మేళా’ సమయంలో ‘బాబా బర్ఫానీ’ని ఆరాధించడానికి భక్తులు ఆలయ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు. కేవ‌లం ఏడాది మొత్తంలో ఇదే స‌మ‌యంలో అమర్‌నాథ్ గుహలోకి ప్రవేశించేందుకు అవ‌కాశం ఉంటుంది.

READ MORE  Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

వార్షిక తీర్థయాత్రకు ముందు, భక్తుల భద్రత కోసం అధికారులు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం. NDRF, SDRF సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందుతారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది భక్తుల భద్రత క‌ల్పించేందుకు జమ్మూకాశ్మీర్ పోలీస్ కు చెందిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్ (MRTs) లో భాగంగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ పోలీస్, SDRF, NDRF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో కూడిన MRT బ‌ల‌గాల‌ను పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చిపోయే మార్గాల్లో దాదాపు 12కు పైగా క్లిష్టమైన ప్ర‌మాద‌క‌ర‌మైన‌ ప్రదేశాలలో మోహ‌రిస్తారు.

READ MORE  నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

Amarnath Yatra 2024  గురించి జమ్మూ కాశ్మీర్ MRT టీమ్ ఇన్‌ఛార్జ్ రామ్ సింగ్ సలాథియా మాట్లాడుతూ.. జూన్‌లో శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభమై దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. యాత్రలో ‘బాబా బర్ఫానీ’ని ఆరాధించడానికి రండి, యాత్రికులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది, ప్రయాణీకులకు సహాయం చేయడానికి మౌంటైన్ రెస్క్యూ టీమ్ (MRT) శిక్షణ పొందుతోంది.

READ MORE  కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

“కొండ ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బలగాలకు పూర్తి శిక్షణ ఇస్తున్నారు, తద్వారా ఈ సైనికులు ఎటువంటి విపత్తునైనా సులభంగా అధిగమించగలరు. తీర్థయాత్ర ప్రయాణంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తారు అని ఆయ‌న తెలిపారు.


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *