Allu Arjun Remand | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కలేదు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బన్నీని హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా మరో బాలులడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటనకు సంబంధించి ఇదివరకే బన్నీ తో సహా పలువురిపై కేసులు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గాంధీ హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా తనపై నమోదైన అన్ని కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, అందుకే కేసులో ఆయన పేరును చేర్చి అరెస్ట్ చేశామని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ (Allu Arjun Remand) విధిస్తూ తీర్పు వెలువరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
[…] Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 ర… […]