Akshardham Temple : అమెరికా న్యూ జెర్సీలో అట్టహాసంగా ప్రారంభమైన అక్షరధామ్ దేవాలయం

Akshardham Temple : అమెరికా న్యూ జెర్సీలో అట్టహాసంగా ప్రారంభమైన అక్షరధామ్ దేవాలయం

Akshardham Temple : భారతదేశం వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక హిందూ దేవాలయం న్యూజెర్సీ అక్షరధామ్ ఆదివారం ప్రారంభమైంది. 183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అసాధారణ నిర్మాణ అద్భుతం  న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణాన 90 కి.మీ దూరంలో ఉంది. 12 సంవత్సరాలలో (2011 నుండి 2023 వరకు), ఇది USA అంతటా 12,500 కంటే ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులచే నిర్మించబడింది. కాగా 1992లో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో మొదటి అక్షరధామ్ నిర్మించబడింది. దాని తర్వాత న్యూఢిల్లీలో (2005లో) అక్షరధామ్ నిర్మించారు.

న్యూజెర్సీలోని అక్షరధామ్ (Akshardham Temple) కోసం ఇటలీ నుండి నాలుగు రకాల పాలరాయి, బల్గేరియా నుండి సున్నపురాయితో కూడిన ఈ విలువైన వస్తువులను తీసుకొచ్చారు. న్యూజెర్సీ అక్షరధామ్ అనేది బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS), స్వామినారాయణ విభాగంలోని ప్రపంచ మతపరమైన అలాగే పౌర సంస్థ.

READ MORE  india maldives relations | మాల్దీవులకు షాక్.. భారీగా పడిపోయిన భారత పర్యాటకుల సంఖ్య..

న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌ లో గల ఈ ఆలయాన్ని 2011 నుంచి 2023 వరకు 12 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా శ్రమించి నిర్మించారు. ఇందులో 12,500 మంది వలంటీర్లు భాగస్వాములయ్యారు. అక్షర్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం 183 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పురాతన హిందూ గ్రంథాల్లోని ఆధారాలతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ 10,000 విగ్రహాలు, భారతీయ సంగీతవాయిద్యాల శిల్పాలు, వివిధ నృత్య రూపాలు కనిపిస్తాయి.

READ MORE  ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

Also Read : ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్

‘ ప్రధాన మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ 12 ఉప పుణ్యక్షేత్రాలు, తొమ్మిది శిఖరాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఏర్పాటు చేశారు.. వెయ్యి ఏళ్ల పాటు ఆలయం పట్టిష్టంగా ఉండేలా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా నిర్మించారు. దీని నిర్మాణంలో సున్నపురాయి, గులాబీ ఇసుక రాయి, పాల రాయి, గ్రానైట్‌తో సహా నాలుగు రకాల రాయిని వినియోగించారు. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయ మెట్ల బావి అయిన బ్రహ్మకుండ్ ( Brahmakund) కూడా నిర్మించారు.

READ MORE  అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

భారతదేశంలోని పవిత్రమైన నదులతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాలు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 లకు పైగా నీటి వనరుల నుంచి పవిత్రజలాన్ని సేకరించి ఇందులో ఉంచారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *