Friday, February 13"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Airtel Recharge Plan | ఇంట్లో, ఆఫీసులో Wi-Fi ఉన్నవారికి ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీచార్జి ప్లాన్ రూ. 509 వివరాలు ఇవే..

Spread the love

Airtel Recharge Plan | భారత్ లో Jio, Airtel, Vi వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచారు. తాజా ఈపెంపు మొబైల్ టారిఫ్‌ను సగటున 15 శాతం పెంచింది. ఈ కారణాలతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ, పాత్ నెట్ వ‌ర్క్ కు అల‌వాటుప‌డిన‌ వినియోగదారులు తమ ప్రస్తుత ఆపరేటర్‌తో నే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకొని సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారు.

మనలో చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచి పని చేస్తున్నారు. హై-స్పీడ్ డేటా, పెరిగిన అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fi కనెక్షన్‌ను వినియ‌గించుకుంటున్నారు. మీరు ఇంటి వ‌ద్ద‌, ఆఫీసులో వైఫై క‌నెక్టివిటీ క‌లిగిఉంటే ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లకు బ‌దులు 84 రోజుల పాటు పొడిగించిన వ్యాలిడిటీని పొందేందుకు మీరు Airtel నుంచి రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మీ ఇల్లు, కార్యాలయంలో Wi-Fiకి యాక్సెస్ కలిగి ఉంటే, Jio రూ. 470 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మీకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Airtel రూ. 509 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 509. ఇది 84 రోజులు చెల్లుబాటు ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్. 1000 SMSలతో 6GB డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 509 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎందుకు ఉత్తమమైనది?

ఈ ప్లాన్ 84 రోజుల పాటు కేవ‌లం 6GB డేటాను మాత్ర‌మే అందిస్తుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా మార్కెట్‌లో Wi-Fi అందుబాటులో లేనప్పుడు కనెక్ట్ అయి ఉండడానికి మీకు ఈ డేటా స‌రిపోతుంది. అదనంగా, ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, 84 రోజుల పాటు 1000 SMSలు ఉన్నాయి. దాదాపు 3 నెలల పాటు మనశ్శాంతిని అందిస్తుంది.

మీకు 6GB కంటే అదనపు డేటా అవసరమైతే?

ప్రస్తుత Airtel Recharge Plan 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది కాదా.. ఒకవేళ మీరు 6GB డేటా పరిమితిని మించి ఉంటే, మీరు Airtel డేటా ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ రూ.99 డేటా ప్లాన్‌లో 2 రోజుల పాటు 20GB డేటాను అందిస్తోంది. మీకు పొడిగించిన వ్యాలిడిటీతో కూడిన డేటా ప్లాన్ అవసరమైతే, మీరు ఎయిర్‌టెల్ రూ. 121 డేటా ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇది ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్ చెల్లుబాటు వరకు 6GB డేటాను అందిస్తుంది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *