Wednesday, July 30Thank you for visiting

Plane Crash | ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానం ఎందుకు కూలిపోయింది..

Spread the love

Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం విమానాశ్రయం నుంచి బయలుదేరిన 5 నిమిషాలకే కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అహ్మదాబాద్‌లో కూలిపోయిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురించి

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అనేది మధ్యస్థ పరిమాణంలో, ఫ్యూయ‌ల్ ఎఫిషియ‌న్సీ, ట్విన్-ఇంజిన్ వైడ్-బాడీ జెట్, ఇది పెద్ద కిటికీలు, తక్కువ క్యాబిన్ ఎత్తు వంటి సౌకర్యవంతమైన లక్షణాలు ఉంటాయి. ఈ విమానం 50% కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ పాలిమర్‌తో తయారు చేయబడింది. దాదాపు 242 మంది ప్రయాణీకులకు సీట్లు ఉన్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ 7,305 నాటికల్ మైళ్ల రేంజ్‌ని కలిగి ఉంది. ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు దీనిని నిర్వహిస్తున్నాయి.

6 శాతానికి పైగా పడిపోయిన షేర్లు

గురువారం ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ షేర్లు బాగా పడిపోయాయి, అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోవడం (Plane Crash) తో 6 శాతానికి పైగా పడిపోయాయి. IST మధ్యాహ్నం 3.31 గంటల నాటికి, బోయింగ్ షేర్లు ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 6.42 శాతం తగ్గి $196.51 వద్ద ముగిశాయి. బుధవారం, స్టాక్ 0.80 శాతం తగ్గి $214 వద్ద ముగిసింది.

బోయింగ్ అనేది అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ, ఇది ప్రపంచవ్యాప్తంగా విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు, ఉపగ్రహాలు, క్షిపణులను డిజైన్ చేస్తుంది, తయారు చేస్తుంది.. విక్రయిస్తుంది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిపోయింది, ఎయిర్‌లైన్ తాజా సమాచారాన్ని షేర్ చేసింది.

ఈ విమానంలో 242 మంది ప్రయాణికులుm సిబ్బంది ఉన్నారని ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ లో ఒక ప్రకటనలో తెలిపింది. “వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు” అని అది తెలిపింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. “మరిన్ని సమాచారం అందించడానికి 1800 5691 444 అనే ప్రత్యేక ప్రయాణీకుల హాట్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసాము” అని తెలిపింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *