Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు

Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు

Kabul : ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా సుమారు 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌ ( Afghanistan’s Herat) లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , వందలాది మంది గాయపడ్డారు. కాగా హెరాత్‌లోని స్థానిక అధికారులు ఈ ప్రావిన్స్‌లో అనేక భూకంపాల (earthquake) లో 30 మందికి పైగా మరణించారని 600 మందికి పైగా గాయపడ్డారని పజ్వాక్ ఆఫ్ఘన్ న్యూస్ నివేదించింది.

READ MORE  Dubai rains | ఎడారి దేశంలో ఆక‌స్మిక వ‌ర్షాలు, రోడ్ల‌పై మోకాళ్ల లోతు వ‌ర‌ద నీరు..

Afghanistan earthquake అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిందా జాన్, ఘోరియన్ జిల్లాల్లోని 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ మాట్లాడుతూ.. నేటి భూకంపం కారణంగా హెరాత్‌లోని “జిందా జాన్” జిల్లాలోని మూడు గ్రామాలలో కనీసం 15 మంది మరణించారని, దాదాపు 40 మంది గాయపడ్డారని టోలో న్యూస్ నివేదించింది.
ఫరా, బద్గీస్ ప్రావిన్స్‌లలోని కొన్ని ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక వీడియోలో తెలిపారు.

READ MORE  ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

US జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఆరు భూకంపాలు (Afghanistan earthquake) సంభవించాయి. ఇందులో అతిపెద్దది 6.3 తీవ్రతతో సంభవించింది. అంతకుముందు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ మాట్లాడుతూ నేటి భూకంపం కారణంగా హెరాత్‌లోని “జిందా జాన్” జిల్లాలోని మూడు గ్రామాలలో కనీసం 15 మంది మరణించారని, దాదాపు 40 మంది గాయపడ్డారని టోలో న్యూస్ నివేదించింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *