ADR Report | లోక్ సభ మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..
ADR Report | రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థులల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మొదటి దశ ఎన్నికల్లో 1,618 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు)లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
అయితే ADR Report ప్రకారం.. క్రిమినల్ కేసులు ఉన్న 252 (16%) అభ్యర్థులలో, 161 (10%) వారిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నారు. అందులో, ఏడుగురు హత్యకు సంబంధించిన కేసులు, 18 మంది మహిళలపై అత్యాచారం వంటి నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వెల్లడించింది., 35 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపింది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులలో 77 మంది (36% ) లో 28 మందిపై కేసులు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులలో56 మంది (34%) లో 19 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్లు అంగీకరించారని వెల్లడించింది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అభ్యర్థులు నలుగురిలో (100%) నలుగురిపై కేసులు ఉన్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), సమాజ్‌వాదీ పార్టీ (SP), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC), బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లకు వరుసగా 59, 43, 40,13 శాతం అభ్యర్థులపై కేసులు ఉన్నాయి.
ఆస్తుల వివరాలు ఇవీ..
102 నియోజకవర్గాల్లో 42 (41%) నియోజకవర్గాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉంటే ఆయా నియోజకవర్గాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేస్తారు.
1,618 మంది అభ్యర్థులలో (28%) 450 మందికి ₹ 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయని ADR నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బిజెపి 69 (90%) కోటీశ్వరుల అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 49 కోటీశ్వరుల అభ్యర్థులను (88%) నిలబెట్టింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.., మొదటి దశలో 10 మంది పోటీదారులు తమ అఫిడవిట్లలో సున్నా ఆస్తులను ప్రకటించారు. కాగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తి ₹ 4.51 కోట్లుగా నివేదించింది.
77 మంది BJP అభ్యర్థులకు ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి ₹ 22.37 కోట్లు కాగా, 56 INC అభ్యర్థుల సగటు ఆస్తులు ₹ 27.79 కోట్లు, 22 DMK అభ్యర్థులు ₹ 31.22 కోట్లు, 4 RJD అభ్యర్థులు ₹ 8.93 కోట్లు, ఏడుగురు SP అభ్యర్థుల సగటు ఆస్తులు ₹ 8.93 కోట్లు. మరియు 5 AITC అభ్యర్థుల సగటు ఆస్తులు ₹ 3.72 కోట్లు.
అత్యధిక ఆస్తులు కలిగిన మొదటి ముగ్గురు అభ్యర్థులు.. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌కు చెందిన నకుల్ నాథ్ ( రూ. 716+ కోట్లు), అన్నాడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ ( రూ. 662+ కోట్లు), తమిళనాడుకు చెందిన బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ టి ( రూ. 304+ కోట్లు).
ఇదిలా ఉండగా , లోక్‌సభ ఎన్నికలు 2024 ఫేజ్ 1లో అభ్యర్థుల ఎంపికలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ రాజకీయ పార్టీ కూడా పాటించలేదు. ఎందుకంటే క్రిమినల్ కేసులు ఉన్న 16% అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే పాత పద్ధతిని వారు మళ్లీ అనుసరించారు” అని ADR నివేదిక పేర్కొంది.
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..