
ADR Report | లోక్ సభ మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..
ADR Report | రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థులల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మొదటి దశ ఎన్నికల్లో 1,618 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు)లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.అయితే ADR Report ప్రకారం.. క్రిమినల్ కేసులు ఉన్న 252 (16%) అభ్యర్థులలో, 161 (10%) వారిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నారు. అందులో, ఏడుగురు హత్యకు సంబంధించిన కేసులు, 18 మంది మహిళలపై అత్యాచారం వంట...