Telangana

Adani Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళం..

Spread the love

Adani Foundation | హైదరాబాద్:  పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ  మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు (Adani Group) చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా రూ.100 కోట్ల విరాళం అందించారు.  ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి రూ.100 కోట్ల చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ (Young India Skills University) కి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని గౌతమ్ అదానీ  హామీ ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *