Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు

Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు

ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివ‌రాల‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మ‌రో మూడు నెలల గడువును పెంచింది. గ‌తంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండగా. ఇప్పుడు దానిని మ‌రో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 (Aadhaar Update Last Date)వరకు పెంచిన‌ట్లు UIDAI వెల్ల‌డించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మేలు జ‌రుగ‌నుంది.

ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే..

ప్ర‌స్తుతం ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ కార్డు ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రైంది. అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ పనులను క‌చ్చితంగా ఆధార్ కార్డు కాపీ స‌మ‌ర్పించాల్సిందే.. దీంతో ఈ కార్డు ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ క‌చ్చిత‌మైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాల్సిన ఉంటుంది. ప్ర‌తీ 10 సంవత్సరాలకు పైగా తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారికి, జనాభా డేటా వివరాలను స‌రిచేసుకోవ‌డానికి గుర్తింపు రుజువు, చిరునామా పత్రాలను సమర్పించాలని UIDAI ప్ర‌క‌టించింది. వీటిని మీరు ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవ‌కాశం కూడా క‌ల్పించింది.

READ MORE  Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన‌ కేంద్రం.. కార‌ణ‌మిదే..

ఆధార్ ను నిర్వ‌హించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకారం ముందుగా ఈ గడువు సెప్టెంబర్ 14, 2024గా నిర్ణయించింది. అయితే ప్ర‌స్తుతం దానిని డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించింది. ఈ తేదీ తర్వాత మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి మీకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటుతో మళ్లీ మూడు నెలల వరకు మీ ఇంటి చిరునామా, పేరు లేదా పుట్టిన తేదీ, ఫొటో వంటి వివరాలను సులభంగా అప్ డేట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ విధానం

  • వివ‌రాల‌ను అప్ డేట్ చేసుసుకునేందుకు మీరు UIDAI uidai.gov.in/en అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • అక్కడ మీరు ‘అప్‌డేట్ ఆధార్ అనే ఆఫ్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత మీరు అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • OTPని నమోదు చేసి మీరు లాగిన్ కావాలి.
  • అప్పుడు మీరు డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ డాక్యుమెంట్‌లను వెరిఫై చేసుకోండి.
  • ఆ తర్వాత మీరు కిందకు స్క్రోల్ చేయండి.
  • అక్కడ మీరు మీ ఐడీ కార్డు, అడ్ర‌స్ ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీని అప్‌డేట్ చేయాలి.
  • అప్పుడు మీరు స‌బ్ మిట్‌ పై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మీ ఫారమ్ సమర్పించబడుతుంది.
  • ఆ క్రమంలో మీకు రిక్వెస్ట్‌ నంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు మీ ఆధార్ అప్‌డేట్ అయిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు.
READ MORE  New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

ఆఫ్‌లైన్‌లో విధానం..  

మీరు మీ ఆధార్ కార్డు వివరాలను ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలనుకుంటే UIDAI వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దానిలో పూర్తి వివరాలు నమోదు చేసి  అవసరమైన పత్రాలను జత చేసి మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అందజేయాలి. ఆధార్ కేంద్రంలో మీరు మీ బయోమెట్రిక్ సమాచారాన్ని ఇవ్వాలి. అప్‌డేట్ స్టాటస్ ను తెలుసుకోవడానికి అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని కలిగి ఉన్న రసీదు స్లిప్‌ను మీరు తీసుకోవాలి. ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 14, 2024. ఈ తేదీ తర్వాత మీరు మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి కనీసం రూ. 50 రుసుమును చెల్లించాలి.

READ MORE  Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *