Posted in

2025 Holiday List | 2025 సెలవుల జాబితా విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

2025 Holiday List
2025 Holiday List
Spread the love

2025 Holiday List : రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. మరికొద్దిరోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో.. 2025 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్, ఆప్షనల్ హాలిడేస్ వివ‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు వొస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

జనవరి ఒకటో తేదీతోనే సెలవుల జాబితాను మొదలుపెట్టిన ప్రభుత్వం.. జనవరి 14న సంక్రాంతి పండుగకు.. మార్చి 30న ఉగాది పండుగకు, ఆగస్టు 27న‌ వినాయక చవితి, అక్టోబర్ 3న విజ‌య‌ద‌శ‌మి(Dasara).. అక్టోబర్ 20న దీపావళి లాంటి ముఖ్య‌మైన‌ పండుగలన్నింటికి ఎప్పటిలాగే ప్రభుత్వ సెలవులను ప్రకటించింంది. అయితే.. జనవరి ఒకట‌వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండ‌వ‌ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. అయితే.. బోనాల పండుగకు కూడా ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది. రంజాన్‌ పండగతో పాటు తర్వాతి రోజున, దసరా పండుగతో పాటు తర్వాతి రోజున కూడా సెలవు ప్రకటించ‌డం విశేషం.. అయితే.. దసరా పండుగ గాంధీ జయంతి రోజున వొచ్చాయి. మరోవైపు.. జూన్ నెలలో ఒక్క సెలవు కూడా రావ‌డంలేదు.

2025లో సాధార‌ణ సెల‌వుల‌ జాబితా (2025 Holiday List)

  • జనవరి 1 న్యూఇయర్
  • జనవరి 13 భోగి
  • జవనరి 14 సంక్రాంతి
  • జనవరి 26 రిపబ్లిక్ డే
  • ఫిబ్రవరి 26 మహా శివరాత్రి
  • మార్చి 14 హోళీ
  • మార్చి 30 ఉగాది
  • మార్చి 31 ఈద్ ఉల్ ఫితర్
  • ఏప్రిల్ 01 రంజాన్
  • ఏప్రిల్ 05 బాబు జగ్జీవన్ రాం జయంతి
  • ఏప్రిల్ 06 శ్రీరామనవవి
  • ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి
  • ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే
  • జూన్ 7 బక్రీద్
  • జులై 06 మొహర్రం
  • జులై 21 బోనాలు
  • ఆగస్టు 15 ఇండిపెన్‌డెన్స్ డే
  • ఆగస్టు 16 శ్రీ కృష్ణాష్టమి
  • ఆగస్టు 27 వినాయక చవితి
  • సెప్టెంబర్ 05 ఈద్ మిలాదిన్ నబీ
  • సెప్టెంబర్ 21 బతుకమ్మ మొదటి రోజు
  • అక్టోబర్ 02 దసరా/గాంధీ జయంతి
  • అక్టోబర్ 03 విజయదశమి తర్వాతి రోజు
  • అక్టోబర్ 20 దీపావళి
  • నవంబర్ 05 కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి
  • డిసెంబర్ 25 క్రిస్టమస్
  • డిసెంబర్ 26 క్రిస్టమస్ తర్వాతి రోజు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *