Zoho Mail Features | ఇప్పటి కాలంలో చాలా మంది వినియోగదారులు గోప్యతా-కేంద్రీకృత, ఉచిత ఇమెయిల్ అనుభవం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో భారత్ లో Gmailకు ప్రత్యామ్నాయంగా Zoho మెయిల్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. యాడ్-ఫ్రీ ఇంటర్‌ఫేస్, కస్టమ్ డొమైన్ మద్దతు, ఉన్నతమైన సెక్యూరిటీ ఫీచర్స్ Zoho మెయిల్‌ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారాలకూ ఆదర్శవంతమైన ఎంపికగా నిలబెట్టాయి.
తమ ఇన్‌బాక్స్‌పై పూర్తి నియంత్రణ కోరుకునే, అలాగే ఉత్పాదకతను పెంచుకోవాలనుకునే వినియోగదారులు Zoho మెయిల్‌ను ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా, Gmail నుంచి Zoho మెయిల్‌కు మారే ప్రక్రియ చాలా సులభం. కేవలం కొన్ని అడుగుల్లోనే మీ అన్ని ఇమెయిల్స్, కాంటాక్ట్స్, డేటాను ఎటువంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేసుకోవచ్చు. Zoho మెయిల్‌తో మీరు భద్రత, గోప్యత, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనుభవాన్ని ఒకే చోట పొందవచ్చు.
జోహో మెయిల్ ఫీచర్లు (Zoho Mail )
Gmail గొప్పదే అయినప్పటికీ, మీరు దానితో విసుగు చెందితే మీరు Zoho Mail ను ప్రయత్నించవచ్చు. అయితే మీరు కొన్ని ఫీచర్లను వదులుకోవాల్సి వస్తుంది. అదనంగా కొన్నింటిని పొందే అవకాశం కూడా ఉంది. Zoho Mail అందించే కొన్ని ముఖ్య ఫీచర్లను ఇప్పుడే తెలుసుకోండి..
ప్రకటనలు లేని అనుభవం
Gmail మాదిరిగా కాకుండా, Zoho Mail ప్రకటనల కోసం ఇమెయిల్‌లను “ప్రాసెస్” చేస్తుందని హామీ ఇస్తుంది. నిజానికి, Zoho Mail లో ఎటువంటి ప్రకటనలు లేవు.
స్ట్రీమ్‌లు: “Streams” Zoho Mailలో ప్రత్యేకమైన ఫీచర్. ఇది సహోద్యోగులతో సోషల్ మీడియా స్టైల్‌లో కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది.
- పోస్టులు సృష్టించవచ్చు
- సహచరులను ట్యాగ్ చేయవచ్చు
- పనులను కేటాయించవచ్చు
- ఈవెంట్‌లను సృష్టించవచ్చు
ఇది ఈమెయిల్‌ను ఒక కోలాబరేటివ్ వర్క్‌స్పేస్‌గా మార్చేస్తుంది.
పెద్ద అటాచ్‌మెంట్‌లు (1 GB వరకు)
పెద్ద అటాచ్‌మెంట్‌లు (1 GB వరకు): Zoho మెయిల్ వినియోగదారులను ఒక్కొక్కటి 1 GB వరకు ఫైల్‌లను అటాచ్ చేయడానికి అనుమతిస్తుంది. ఒకవేళ ఫైల్ సైజ్ ఎక్కువగా ఉంటే ఆ ఫైల్‌లు ఆటోమెటిక్‌గా లింక్‌గా మార్చబడి ఇమెయిల్‌కు జోడించబడతాయి.
ఇమెయిల్ రీకాల్:
Gmail యొక్క లిమిటెడ్ పిరియడ్ వరకు అన్‌డూ సెండ్” లా కాకుండా, జోహో మెయిల్ పంపిన విండో గడువు ముగిసిన తర్వాత కూడా పంపిన ఇమెయిల్‌ను రీకాల్ చేయడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ఇమెయిల్ రీకాల్ చేయబడిందని గ్రహీతకు తెలియజేస్తుంది.
S/MIME భద్రత
ప్రామాణిక TLS ఎన్‌క్రిప్షన్‌తో పాటు, Zoho మెయిల్ S/MIMEకి మద్దతు ఇస్తుంది. దీని వలన వినియోగదారులు ఇమెయిల్‌లను మరింత సురక్షితంగా ఉంచడానికి, సైబర్ దాడుల నుండి వారిని రక్షించడానికి డిజిటల్ సంతకాలను సృష్టించడానికి వీలు కలుగుతుంది.
- డిజిటల్ సంతకాలు జోడించవచ్చు
- మెసేజ్‌లు మరింత సురక్షితంగా ఉంటాయి
- ఫిషింగ్ మరియు సైబర్ దాడుల నుంచి రక్షణ లభిస్తుంది
ఇమెయిల్ బ్యాకప్- eDiscovery: ఇది సంస్థలు అన్ని ఇమెయిల్‌లను బ్యాకప్ చేయడానికి మరియు చట్టపరమైన లేదా సమ్మతి ప్రయోజనాల కోసం (eDiscovery) నిర్దిష్ట సందేశాలను తిరిగి పొందవచ్చు.
స్మార్ట్ ఫిల్టర్లు: ఇన్‌కమింగ్ సందేశాలను ఆటోమెటిక్‌గా స్కాన్ చేస్తుంది. వాటిని నోటిఫికేషన్‌లు, న్యూస్ లెటర్లు వంటి ఫోల్డర్‌లుగా వర్గీకరిస్తుంది, దీనివల్ల మీ ఇన్‌బాక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది.
ఇంటిగ్రేటెడ్ ప్రొడక్టివిటీ టూల్స్:
జోహో మెయిల్‌లో క్యాలెండర్ (Calendar), టాస్క్‌లు, నోట్స్, కాంటాక్ట్‌లు, బుక్‌మార్క్‌లు ఉంటాయి, ఇవన్నీ Zoho Mailలోనే మీకు లభిస్తాయి, Zoho ecosystemలో ఇవి సమన్వయంగా పనిచేస్తాయి — మీరు వేర్వేరు యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం ఉండదు.
మొబైల్ వినియోగదారుల కోసం Zoho ప్రత్యేకంగా:
Zoho Mail, Zoho Mail Streams, Zoho Mail Admin అనే యాప్‌లను Android, iOS వెర్షన్లలో అందిస్తుంది.
దీని ద్వారా మీరు ప్రయాణంలో ఉన్నా, మీ మెయిల్‌బాక్స్, టీమ్‌తో కనెక్ట్‌గా ఉండగలుగుతారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.




