ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి

ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి

జార్ఖండ్: బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఎద్దును కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగగా మట్టిపె ల్లలు పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలోకి దిగిన మరో ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మురిఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో.. గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో ఎద్దుని పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో మట్టిపెళ్లలు కూలిపో యాయి. పైన ఉన్న మరో ముగ్గురు కూడా బావిలో పడిపోయారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు బావిలో ఉండగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని స్థానిక ప్రజలు శ్రమించి క్షేమంగా పైకి తీసుకొచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు ఘటనాస్థలికి చేరుకు న్నారు. బావిలో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం బయటకు తీయగా.. మరో నాలుగు మృతదేహాల కోసం సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే.. 40 అడుగుల లోతులో కూరుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. కాగా.. ఈ విషాద సంఘటపై రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

READ MORE  రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *