Vodafone Idea | భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసి వినియోగదారులకు నిరాశ కలిగించింది. జూలైలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తన ప్లాన్ ధరలను పెంచాయి. ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు BSNLకి మారడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులను కోల్పోయినప్పటికీ, ఈ నష్టం వల్ల వొడాఫోన్ ఐడియా పెద్దగా ప్రభావితం కాలేదని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు, కంపెనీ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలోని రెండు ప్రయోజనాలకు కోతలు విధించింది. ఇది చాలా మంది వినియోగదారులను నిరాశకు గురి చేస్తుంది. ఈ ప్లాన్‌లలో ఏం మార్పు చేసిందో ఒకసారి చూడండి..
రీచార్జి ప్లాన్ రూ.289
ముందుగా రూ.289 ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు, ఈ ప్లాన్ 48 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. అంటే వినియోగదారులు దాని ప్రయోజనాలను ఎక్కువ కాలం ఆనందించవచ్చు. ఇది ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత కాల్‌లు, రోజువారీ డేటా కూడా అందించేది. కానీ దురదృష్టవశాత్తు, వోడాఫోన్ ఐడియా ఇప్పుడు ఈ ప్లాన్ వాలిడిటీని కేవలం 40 రోజులకు కుదించింది.
Vodafone Idea రీచార్జి ప్లాన్ రూ.479
ఆ తర్వాత, రూ. 479 ప్లాన్.. ఇది దీర్ఘకాలిక ఉపయోగం కోసం తీసుకొచ్చింది. ఇది అపరిమిత కాలింగ్‌తో పాటు 56 రోజుల వ్యాలిడిటీని అందించింది. అయితే, ఈ ప్లాన్ లో కూడా కోతలు విధించింది. ఇప్పుడు వాలిడిటీ 48 రోజులకు తగ్గింది. తక్కువ చెల్లుబాటుతో పాటు, రోజువారీ డేటా మొత్తం 1.5GB నుండి కేవలం 1GBకి తగ్గించింది. ఈ మార్పుల వల్ల వోడాఫోన్ ఐడియా కస్టమర్‌లు మునుపటితో పోలిస్తే వారు పెట్టి డబ్బులకు తక్కువ తక్కువ ప్రయోజనాలను పొందుతారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..