Wednesday, April 1, 2026
Telangana

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

Spread the love

వేముల‌వాడ‌ రాజన్న ఆల‌యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!

Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.

జాతర విశేషాలు & భక్తుల సౌకర్యాలు :

స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: వేముల‌వాడ ప్ర‌ధాన ఆల‌యంలో ధర్మగుండం ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో, భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశంలో 400 షవర్ నల్లాలు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులను సైతం నిర్మించారు.

దర్శన ఏర్పాట్లు: భక్తులు రాజ‌రాజేశ్వ‌ర‌స్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించి, తమ మొక్కులైన కోడె మొక్కు, ఎత్తు బెల్లం పంపిణీ, బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు.
చలువ పందిళ్లు & ఆహారం: సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగతో పాటు అల్పాహారం (ఉప్మా, పులిహోర) పంపిణీ చేయనున్నారు.

మద్యం విక్రయాలు బంద్: జాతర పవిత్రతను కాపాడేందుకు వేములవాడ పట్టణంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేశారు.

రవాణా సౌక‌ర్యాలు

600 ఆర్టీసీ బస్సులు: కరీంనగర్ రీజియన్‌లోని 14 డిపోల నుంచి 600 బస్సులను నడుపుతున్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఆలయానికి భక్తులను చేరవేసేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.
వైద్య సేవలు: 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు 30 మంది డాక్టర్లు, 130 మంది పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. అత్యవసర సహాయం కోసం అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం 50 మంది సెస్‌ సిబ్బందిని, అగ్నిప్రమాదాల నివారణకు 5 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు.

రాజన్న సన్నిధిలో ఏకాంత పూజలు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి మహాలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ పూజలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. శివదీక్ష స్వాములు తమ దీక్షలను విరమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *