ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

Ayodhya : ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి ఏకకాలంలో ఎనిమిది దేశాల్లో సమయాన్ని సూచించేలా అద్భుతమైన గడియారాన్ని రూపొందించారు. దీనిని అయోధ్య రామమందిరాని (Ayodhya Ram Temple) కి బహుమతిగా ఇచ్చాడు. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పారు.
ఈసందర్భంగా సాహూ మాట్లాడుతూ..”నేను అక్టోబర్ లో దేవీ నవరాత్రుల సమయంలో ఈ గడియారం (75 సెం.మీ.)పై పని చేయడం ప్రారంభించాను. ఇటీవల చంపత్ రాయ్ జీకి అలాంటి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాను,” అని తెలిపారు. గతంలో, అతను లక్నోలోని ఖతు శ్యామ్ దేవాలయం, కొత్వా ధామ్, బారాబంకిలోని కుంతేశ్వర్ మహాదేవ్ లకు కూడా అలాంటి గడియారాలను బహుమతిగా ఇచ్చారు.
లక్నో హనీమాన్ క్రాసింగ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ లో సాహు రూపొందించిన గడియారం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ గడియారం భారతదేశం, దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), టోక్యో (జపాన్), మాస్కో (రష్యా), బీజింగ్ (చైనా), సింగపూర్, మెక్సికో సిటీ (మెక్సికో), వాషింగ్టన్ DC, న్యూయార్క్ (USA)లో రియల్ టైంను చూపిస్తుంది.
2018లో తాను తొలిసారిగా గడియారాన్ని తయారు చేశానని, దానికి ‘డిజైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్’ వచ్చింది. ఇది భారతదేశం, చైనా, దుబాయ్, మాస్కో, టోక్యో ప్రాంతాల్లోని రియల్ టైంను ప్రదర్శించింది. Ayodhya Ram Temple
సాహు భవిష్యత్తులో 25 దేశాల సమయాలను చూపే గడియారాలను రూపొందించాలని యోచిస్తున్నారు. ఓమన్ కు చెందిన తన స్నేహితుడితో టైమ్ జోన్ గురించి చర్చ సందర్భంగా ఈ ఆలోచనకు స్ఫూర్తిని పొందానని సాహు చెప్పారు. అలాంటి ఒక గడియారాన్ని తాను ప్రధాని నరేంద్ర మోదీకి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు.

READ MORE  రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *