Vande Bharat Sleeper Trains | వందేభారత్ స్లీపర్ రైళ్లు రెడీ.. త్వరలోనే ప్రారంభం.. స్లీపర్ కోచ్ లో అద్భుతమైన ఫీచర్లు..
Vande Bharat Sleeper Trains : వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుపై ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. దాదాపు అన్ని రైళ్లు 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలో ప్రయాణిస్తున్నాయి. అయితే భారతీయ రైల్వే ఇప్పుడు రైలు స్లీపర్ వేరియంట్‌పై పని చేస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలులో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన ఫీచర్లు ఉంటాయి. వీటిని భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రీమియం ఆఫర్‌లుగా అందజేస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు మొదటి నమూనా BEML లో తయారవుతోంది. ఈ వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు మరికొన్ని రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుంది? ప్రయాణీకులకు ఎలాంటి సౌకర్యాలు ఫీచర్లను అందిస్తుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌టీరియర్:
వందే భారత్ స్లీపర్ రైలు ముందు భాగంలో డిజైన్, “భీకరమైన ఈగల్స్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్ 16 కోచ్‌ల రైలుగా 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లు, ఒక AC 1వ కోచ్‌తో సెట్ చేశారు. రైలు మొత్తం 823 మంది ప్రయాణికుల బెర్త్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందులో AC 3 టైర్‌లో 611, AC 2 టైర్‌లో 188 తోపాటు AC 1లో 24 బెర్త్ లు ఉండనున్నాయి.
వందే భారత్ స్లీపర్ AC 3 టైర్ కోచ్: ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వేలు ప్రతి బెర్త్ వైపు అదనపు కుషనింగ్‌ను అందిస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే బెర్త్‌లపై కుషనింగ్ మెరుగ్గా ఉంటుంది.
వందే భారత్ స్లీపర్ ఇంటీరియర్:
కొత్త రైలు లోపలి భాగం క్రీమ్, పసుపు, వుడ్ రంగులలో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. రైలులో ప్రయాణికులు ఎగువ మధ్య బెర్త్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి మెరుగైన డిజైన్ తో నిచ్చెనను కలిగి ఉంటుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ఫీచర్లు (Vande Bharat Sleeper Trains Features): రైలులో సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్దం ఇన్సులేషన్, సైలెంట్ సెలూన్ స్పేస్ కోసం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక బెర్త్‌లు, డిఫరెంట్లీబుల్డ్ కోసం టాయిలెట్లు, ఆటోమేటిక్ ఎక్స్‌టీరియర్ ప్యాసింజర్ డోర్లు ఇతర ఫీచర్లు ఉంటాయి.
2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!
వందే భారత్ స్లీపర్ స్పీడ్ : కొత్త ఇండియన్ రైల్వేస్ రైలు సెమీ-హై స్పీడ్ రైలుగా ఉంటుంది. ఇది గంటకు 160 కిమీ వేగంతో దూసుకెళ్లగలదు. ప్రోటోటైప్ గరిష్టంగా 180 kmph వేగంతో పరీక్షిస్తున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రాత్రిపూట ప్రయాణించేవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలదని భావిస్తున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..