cylinder on the railway tracks : ఉత్తరఖండ్ లో మరో రైలు ప్రమాదానికి దుడగులు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం 6:35 గంటల సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా – ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘటన స్థలానికి పంపించి పరిశీలించగా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్ మాస్టర్ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) సమాచారం అందించారు. రూర్కీలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు ఉపాధ్యాయ్ తెలిపారు.
Cylinder on the railway tracks :ఇదిలా ఉండగా గత నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రైలు పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. కాన్పూర్‌లో గూడ్స్ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌లపై సిలిండర్‌ను చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో మరో పెను ప్రమాదం తప్పింది.
సెప్టెంబర్ మొదటి వారంలో భివానీ-ప్రయాగ్‌రాజ్ కాలింది ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై ఉంచిన ఎల్‌పిజి సిలిండర్‌ను ఢీకొట్టడంతో అప్రమత్తమైన లోకో పైలట్ బ్రెక్ వేయడంతో ప్రమాదం తప్పింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..