Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేతనాల నిలిపివేత
Uttar Pardesh | ఆన్‌లైన్‌లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆన్‌లైన్‌లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని కారణంగా వారి వేతనాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంలో 2,44,565 మంది ఉద్యోగులు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు అందుకోలేదు. శాఖల నివేదికల ఆధారంగా ఈ ఉద్యోగులందరికీ ఆగస్టు నెల జీతాలు నిలిపివేశారు. ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 31 లోపు రాష్ట్ర ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను మానవ సంపద పోర్టల్ (Manav Sampada Portal )లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, సమాచారం ప్రకారం, 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, పీపీఎస్, పీసీఎస్ అధికారుల తరహాలో రాష్ట్ర ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలను తెలియజేయడం తప్పనిసరి చేశారు.
జీతం ఎందుకు ఆగిపోయింది?
ఉత్తరప్రదేశ్ (Uttar Pardesh)లో, 31 ఆగస్టు 2024 నాటికి తమ ఆస్తుల పూర్తి వివరాలను ఇవ్వనందుకు 2 లక్షల 45 వేల మంది రాష్ట్ర ఉద్యోగుల ఆగస్టు జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది, ఉద్యోగులకు సంబంధించిన పూర్తి చర, స్థిరాస్తులను ఆగస్టు 31లోగా మానవ్ సంపద పోర్టల్‌లో సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఆదేశించారు. ఉద్యోగులందరికీ సీఎం యోగి ( Yogi Adityanath) కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ గడువు ముగిసినా ఆస్తి వివరాలు సమర్పించని ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు నిలిపివేశారు.
రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 46 వేల 640 మంది ఉద్యోగులు ఉన్నారని వారిలో 71 శాతం మంది ఉద్యోగులు వివరాలు వెల్లడించారు. అందిన సమాచారం ప్రకారం కేవలం 6 లక్షల 2 వేల 75 మంది ఉద్యోగులు మాత్రమే తమ చర, స్థిరాస్తుల వివరాలను వెల్లడించారు. అయితే రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇందులో చేర్చలేదు. ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఆస్తి వివరాలను అందించకపోతే, వారి జీతాలు విడుదల చేయబడవని వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..