ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో నేలమట్టం..
ujjain horror : ఇటీవల యావత్ దేశాన్ని కలచివేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచార ఘటనలో నిందితుడి ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేయించింది. 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు భరత్ సోనీకి చెందిన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ నేలమట్టం చేసింది. నివేదికల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు బుధవారం కూల్చివేశారు.
తర్వాత అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయడానికి బుల్‌డోజర్‌ను అక్కడికి తీసుకువచ్చారు. వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్ సోనీని గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. 12 ఏళ్ల బాలికపై భరత్ సోనీ అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక చిరిగిపోయిన దుస్తులతో వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి సాయం అడిగింది. అయితే ఆ బాధితురాలికి ఎవరూ సహాయం చేయలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. సుమారు 8 కి.మీ దూరం సహాయం (ujjain) కోసం వీధుల్లో నడిచినట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా తెలిసింది.
తర్వాత ఆమెకు ఓ ఆలయ పూజారి సహాయమందించాడు. ఈలోగా భరత్ సోనీపైనే కాకుండా ఆమెకు సహాయం చేసేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయించారు.. ఆమె ujjainలో రోడ్డుపై వెళ్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడతో వైరల్‌గా మారింది. గత నెల 25వ తేదీన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
కాగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నానాఖేడాలోని ఆటోడ్రైవర్ భరత్ సోనీ ఇంటిని (house) అధికారులు పూర్తిగా ధ్వంసంచేశారు. ఈ సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ బృందం, స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. భరత్ సోనీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు (house) కట్టుకున్నాడని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 12 ఏళ్ల బాలికపై కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడిన భరత్ సోనీని త్వరగా శిక్షించేలా చూస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉండగా.భరత్ సోనీ తండ్రి.. నా కొడుకును కలవడానికి నేను ఎక్కడికి కూడా వెళ్లనని, వెంటనే వాడిని ఉరితీయాలని బహిరంగంగా డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.