గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..

గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..

TTD Trust Board Meeting : యువ‌తీయువకుల్లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుంచి తొలి అడుగు వేస్తున్నామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామి వారి బ్రే క్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవింద నామాలు రాసిన‌వారికి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌ వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మొదటి స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సమావేశలో తీసుకున్న కీలక నిర్ణ‌యాల‌ను
ఛైర్మ‌న్ మీడియాకు వెల్లడించారు.

– స‌నాత‌న ధ‌ర్మం, మాన‌వీయ, నైతిక విలువ‌లపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కేజీ నుంచి పీజీ వ‌ర‌కు విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20పేజీల్లో
భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలను ముద్రించి పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

టీటీడీ పాలకమండి కీలక నిర్ణయాలివే :

– అధిక మాసం కారణంగా ఈ సంవత్సరం సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవ రాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము. పెరటాసి మాసం సైతం వస్తున్నందున భక్తు ల రద్దీ అత్యధికంగా ఉంటుంది.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తాం.

READ MORE  Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..

– సెప్టెంబరు 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 2024 టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు.

బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున విశేషంగా వచ్చే భక్తులకు వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే తగిన భద్రతా
ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. – నేరుగా వచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించలేని భక్తుల సౌకర్యార్థం ఉదయం, రాత్రి వాహన సేవలను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

– చిరుతపులి దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ నుంచి గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.10లక్షలకు పెంచాలని నిర్ణయించారు.

– ఈసారి జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణకు అదనంగా కార్మికులను నియమించుకునేందుకు రూ.32.73 లక్షలు మంజూరుకు ఆమోదం.

– చంద్రగిరి శ్రీమూలస్థాన యల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండర్ ఆమోదం.
– ముంబైలోని బాంద్రాలో రూ.1.65 కోట్లతో శ్రీవేంకటేశ్వరస్వామివారి రెండో ఆలయం, రూ.5.35కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణానికి పరిపాలనపరమైన ఆమోదం. ఈ మొత్తాన్ని టీటీడీ బోర్డు స‌భ్యులు విరాళంగా అందిస్తారు.

– తిరుపతిలోని టీటీడీ ఉద్యోగుల కాలనీలైన కేశవాయ గుంట, భైరాగి పట్టెడ, వైకుంఠ పురం, ఎల్‌ఎస్‌ నగర్‌లలో రూ.4.15 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేసేందుకు ఆమోదం.

READ MORE  Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌

– రూ.49.48 కోట్లతో టీటీడీ ఉద్యోగులకు సంబంధించిన 1,476 క్వార్టర్ల మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం.

– రూ.33 కోట్లతో వడమాల పేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలంలో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు.

– టీటీడీ ఆలయాల్లో అర్చకులు, పరి చారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లు కలిపి 413 పోస్టులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయం.

– రూ.600కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి ఆమోదం.

– తిరుపతి లో నిర్మాణం కానున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 29 మంది స్పెషలిస్టు వైద్యులు, 8 మంది డ్యూటీ డాక్టర్లు, 15 మంది పాలన సిబ్బంది, ఏడుగురు పారా మెడికల్‌ సిబ్బంది, 241 మంది శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌ పవర్‌ కార్పొరేషన్‌ సిబ్బంది కలిపి మొత్తం 300 మంది నియామకానికి ఆమోదం.

– టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల,తిరుపతిలోని ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఒక ఏడాదికి గాను మెడికల్‌, సర్జికల్‌, ల్యాబ్‌, ఎక్స్‌రే విభాగాలకు
మందుల తో పాటు ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.2.46 కోట్లతో టెండర్ కు ఆమోదం.

– తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది.

READ MORE  Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

– టీటీడీ ఆధ్వర్యంలోని కీసరగుట్ట, ధర్మగిరి, ఐ.భీమవరం, విజయనగరం, కోటప్పకొండ, తెలంగాణలోని నల్గొండ వేద విజ్ఞాన పీఠాలకు సంబంధించి అదనంగా 47 అధ్యాపక పోస్టుల మంజూరుకు ఆమోదం.

– భక్తులు తిరుచానూరుకు సులువు గా చేరుకునేందుకు రేణిగుంట రోడ్డులోని  నారాయణాద్రి కూడలి నుంచి తిరుచానూరు వైపు ఉన్న రహదారిని నాలుగు లైన్ల
150 అడుగుల బైపాస్ రోడ్డు గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల యాత్రీకులకు సౌకర్యంతోపాటు తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది.

తిరుపతి నగరంలోని శ్రీనివాసం వసతి సముదాయం పక్కనే ఉన్న వైఎస్సార్ మార్గం నుంచి సామవాయి మార్గం వరకు రూ.9.60 కోట్లతో 40 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి నిర్ణయం.

– తిరుచా నూరు అమ్మవారి దర్శనం అనంతరం యాత్రికులు తిరుపతి నగరంలోని మంగళం ప్రాంతానికి తొందరగా చేరుకోవడానికి వీలుగా మంగళం రోడ్డులోని ఆర్టీవో  ర్యాలయం కూడలి నుంచి రేణిగుంట రోడ్డులోని పద్మావతి ఫ్లోర్ మిల్ వరకు రూ.19.50కోట్లతో 2.90 కిలోమీటర్ల దూరం 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం.

– యాత్రికులకు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా రేణిగుంట రోడ్డులోని హీరో హోండా షోరూం నుంచి తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద బైపాస్ రోడ్డు వరకు చేరుకునేలా రూ.4 కోట్లతో 1.135 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అనుమతి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *