రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

కేసు నమోదు చేసిన పోలీసులు

పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటాలు(tomatoes) చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ నుంచి పూణే పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు, అతను తన ఇంటి వెలుపల పండించిన సుమారు 400 కిలోల టమోటాలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు.
“ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన వాహనంలో 20 డబ్బాల్లో టమాటాలు ఉంచినట్లు రైతు పేర్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి డబ్బాలు కనిపించకుండా పోయాయని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వాటి ఆచూకీ లభించలేదని చివరకు తన పంట చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
రైతు ఫిర్యాదు మేరకు టామాటా దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. tomatoes stolen from farmer
ఇప్పటికే దేశవ్యాప్తంగా టమాటా ధరలు కిలోకు రూ. 80 నుంచి రూ.100 వరకు పెరిగడంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. టమాటా పంటలు రైతులను కొద్ది రోజుల్లోనే లక్షాదికారులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు దుండగులు టామాటా పంటలను ఎత్తుకెళ్తున్నవ సంఘటనలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.

READ MORE  Suresh Gopi కేర‌ళ కమ్యూనిస్టు కంచుకోటలో చ‌రిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *