TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.

ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్ర‌యాణికుల‌ రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు న‌డిపిస్తుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది.

READ MORE  Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల్లో 25 శాతం వ‌ర‌కు ర‌ద్దీ పెరిగింది. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణ‌మి, త‌దిత‌ర పండుగ‌ల‌కు బ‌స్సుల్లో ప్ర‌యాణాలు భారీగా పెరిగాయి. ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా పండుగుల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల‌కు చార్జీల‌ను జీవో ప్ర‌కారం స‌వ‌రిస్తున్నామ‌ని టీజీఎస్‌ఆర్టీసీ ప్ర‌క‌టించింది.

9 వేల బ‌స్సు స‌ర్వీసులు

TGSRTC లో ప్ర‌స్తుతం 9 వేల‌కు పైగా బ‌స్సులు సేవ‌లందిస్తున్నాయి. పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు స‌గ‌టున 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతోంది. ఆ 500 స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల సవరణ ఉంటుంది. మిగ‌తా 8500 రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దని తెలిపింది. .

READ MORE  Zero Interest loans | మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. పొదుపు సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు..

పండుగ స‌మ‌యాల్లో రెగ్యుల‌ర్ , స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌ల్లో తేడాలు ఉండ‌డం సాధారణమే.. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ప్ర‌యాణికుడు వెళ్లేట‌ప్పుడు రెగ్యుల‌ర్ స‌ర్వీసుల్లో ప్రయాణిస్తే సాధార‌ణ టికెట్ ధ‌ర‌నే ఉంటుంది. తిరుగుప్ర‌యాణంలో స్పెష‌ల్ బ‌స్సును వినియోగించుకుంటే జీవో ప్ర‌కారం సవరణ చార్జీ లు ఉంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియస్తారు.

READ MORE  తెలంగాణలో రేపే కౌంటింగ్‌.. ఉదయం 10 గంటల్లోపు తొలి ఫలితం

పండ‌గ స‌మ‌యాల్లో మాత్ర‌మే జీవో ప్ర‌కారం స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌లను సవరిస్తామ‌ని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC ) యాజ‌మాన్యం మరోసారి స్ప‌ష్టం చేసింది. సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉంటాయి. స్పెష‌ల్ స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోందని ఆర్టీసీ వెల్ల‌డించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *