TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త..  త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు

TGSRTC | కిక్కిరిసిపోయిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రోడ్లపైకి మరో 1500 బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని స్యయంగా  రవాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామ‌ని,  త్వ‌ర‌లో మ‌రో 1500 కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని ప్రకటించారు. ఈమేరకు  శ‌నివారం నల్లగొండ బస్ స్టాండ్ లో కొత్త‌ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో నల్లగొండ నుంచి హైదారాబాద్ కు 3 డీలక్స్, ఒక ఏసీ బస్సు ,ఒక పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి.

READ MORE  TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..

ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు మంత్రులు బస్సులో ప్రయాణించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ  కార్మికుల‌కు (TGSRTC Employees ) 21 శాతం పిఆర్సి అందించామని, 3035 ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీలో రోజువారీ నష్టాలు లేకుండా చూస్తున్నామ‌ని తెలిపారు. 33 జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఏసీ బస్సులు, ప్రతీ నియోజకవర్గ కేంద్రం నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను నడిపిస్తున్నామ‌ని మంత్రి  వివ‌రించారు.

READ MORE  Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

నల్గొండ జిల్లాలో 7 బస్ డిపోలు, 34 బస్ స్టాండ్లు, రోజుకు 645 బస్సులతో 2 లక్షల 55 వేల కిలోమీటర్లు తిరుగుతూ ,దాదాపు 3 లక్షల ప్రయాణికులను తరలిస్తోంద‌ని మంత్రి పొన్నం వివరించారు. దసరాలోపు 7 డిపోలకు 30 ఎక్స్ ప్రెస్, 30 లగ్జరి బస్సులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశానుసారం ఈ జిల్లాకు కేటాయించ‌నున్న‌ట్లు తెలిపారు. నార్కెట్ పల్లి బస్సు డిపో పూర్వ‌వైభ‌వం తీసుకొస్తామ‌ని తెలిపారు. నల్గొండ నుంచి హైదారాబాద్ కి ఏసీ బస్సులు ప్రారంభించామ‌ని, అన్ని జిల్లా కేంద్రాల్లో నుంచి హైదరాబాద్ కి ఏసీ బస్సులు నడిపిస్తామ‌ని తెలిపారు. ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామ‌న్నారు.  నల్గొండ నుంచి తిరుపతికి త్వరలోనే బస్సు ప్రారంభిస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.

READ MORE  Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై 'తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *