
TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.

నేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.

Rain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ వాతావరణం చల్లబడనుంది. దీంతో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు తాజా వర్షాలతో ఉపశమనం కలగనుంది.

ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, అదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, గద్వాల్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, ఆసిఫాభాద్ తోపాటు జగిత్యాల, సిరిసిల్ల, హనుమకొండ, సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వానలు, బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి.

నేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది. కానీ సాయంత్రం తర్వాత రాయలసీమలోకి మేఘాలు ప్రవేశిస్తాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.