
Osmania | ఉస్మానియా ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన.. తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్తగా ఉస్మానియా ఆస్పత్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిరసనలు, ఉద్రిక్తల మధ్య ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని గోషామహల్ పరిరక్షణ సమితి మొదటి నుంచే వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవనెత్తారు. కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిని ఇప్పుడున్న భవనం వెనుక భాగంలోనే కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.New Osmania Hospital పై వ్యతిరేకత ఎందుకంటే..గోషామహల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్పత్రి కట్టడంతో ఆ ప్రాంతంలో రద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందనే అభ్యంతరం వ్యక్తమవుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు పలువురు ఈ నిర్మా...