Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

సికింద్రాబాద్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ వరకు రోడ్ల విస్తరణకు సహకరించండి..

సికింద్రాబాద్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ వరకు రోడ్ల విస్తరణకు సహకరించండి..

Telangana
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి (Kishan Reddy) ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరారు.నగర శివార్లలోని చెర్లపల్లిలో రూ.415 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే టెర్మినల్‌ నిర్మాణం పూర్తిచేస్తున్నట్లు సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి తెలియజేశారు.. ఈ టెర్మినల్ హైదరాబాద్‌కు ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాక పోకలకు కేంద్రంగా ఉంటుందని, అందువల్ల, అటువంటి ముఖ్యమైన రైల్వే టెర్మినల్‌కు చేరుకోవడానికి ఎఫ్‌సిఐ గోడౌన్ వైపు నుండి ప్రయాణీకుల ట్రాఫిక్ కోసం 100 అడుగుల రహదారి అవసరమని ఆయన అన్నారు. టెర్మినల్‌కు వెళ్లే రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్‌ను వచ్చే ఏడాది చివర...
Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

Telangana
Indian Railways update :  దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజుల‌పాటు అనేక రైళ్లను ర‌ద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్ల‌ను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్ర‌ధానంగా సికింద్రాబాద్, రక్సాల్, హైదరాబాద్ పాట్నా మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి.రైలు నం. 07005 సికింద్రాబాద్-రక్సాల్ స్పెషల్ 2024 సెప్టెంబర్ 23, 30వ‌ తేదీల్లో రద్దు చేశారు. రైలు నం. 07006 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 26 సెప్టెంబర్, అక్టోబర్ 3న రద్దు రైలు నం. 07051 హైదరాబాద్-రక్సాల్ స్పెషల్ 28 సెప్టెంబర్, అక్టోబర్ 5వ తేదీన‌ రద్దు రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 2024 అక్టోబర్ 1, 8వ‌ తేదీల్లో రద్దు రైలు నం. 03253 పాట్నా-సికింద్రాబాద్ స్పెషల్ 23, 25, 30 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024 తేదీల్లో రద్దు రైలు నం. 07255 హైదరాబాద్-పాట్నా స్పెషల్ 25 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024న రద్దు రై...
TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

Telangana
TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లే చాన్స్‌ ఉందని అంచనా వేసింది.ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. అలాగే బుధవారం ఆదిలాబ...
Hydra News | స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్‌, మాదాపూర్‌లో ఆక్రమణల నేలమట్టం

Hydra News | స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్‌, మాదాపూర్‌లో ఆక్రమణల నేలమట్టం

Telangana
Hydra | హైద‌రాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత‌ల‌ను మరింత ముమ్మ‌రం చేసింది. హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్లం చేస్తోంది. కాగా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించ‌కుండా అనుమ‌తులు లేకుండా భారీ విల్లాలు నిర్మించారు.దీంతో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకోకుండా అక్క‌డ భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహరించారు.ఇదిలా ఉండ‌గా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా నేల‌మ‌ట్టం చేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో విస్త‌రించి ఉండ‌గా దీని ప‌రిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో వెలిసిన షెడ్లు, భవనాలను హైడ్రా బుల్ డోజ‌ర్‌ కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్‌ల...
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

Telangana
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఇదిలా ఉండ‌గా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ వీరంద‌రిలో చివ‌ర‌కు రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం (TPCC President)  ద‌క్కింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే దానిపై రెండు వారాల క్రిత‌మే క‌స‌ర‌త్తు జ‌ర‌గ‌గా, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారికంగా ప్ర...
Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

Telangana
హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న త‌రుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్ర‌హాల వ‌ర‌కు రోడ్ల‌పై క‌నువిందు చేస్తున్నాయి. వ‌ర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య‌ ఊరేగింపుల‌తో మండ‌పాల వ‌ద్ద‌కు త‌ర‌లిస్తున్నారు. ఖైర‌తాబాద్ లో 70 అడుగుల భారీ విగ్ర‌హం.. Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా చరిత్రలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక‌ మార్కెట్లలో కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌మాల క్ర‌య విక్ర‌యాల‌తో సందడి నెల‌కొంది. అయితే పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు ప్రతిస్పందనగా, అనేక మంది మట్టి, సహజ రంగులతో తయారు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడం కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు విక్రయించే స్టాళ్ల వ...
TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

Andhrapradesh, Telangana
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది.హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...
Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?

Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?

Telangana
Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్ప‌త్తి పెంచేందుకు తెలంగాణ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తోంది. ఇప్ప‌టికే గృహ‌జ్యోతి ప‌థ‌కం (Gruha jyothi Pathakam)  కింద పేద‌ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తుండ‌డంతో ప్ర‌భుత్వంపై భారం ప‌డుతోంది. అంతేకాకుండా కొన్ని నెల‌లుగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌డ‌తో ప్ర‌జ‌ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యుత్ శాఖ‌పై బుధ‌వారం స‌మీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌విష్య‌త్ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌న్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ చర్యలు చేపట్టాల‌ని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిని ...
TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Telangana
New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి.1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు.మరోవైపు ఎంజీబీఎస్‌...
Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Telangana
Rains | ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్ల‌డించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని వివ‌రించింది.దీని ప్ర‌భావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్...