Taiwan Earthquake : తైవాన్‌లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు..
Taiwan Earthquake | తైవాన్ రాజధాని తైపీ నగరాన్ని భారీ భూకంపం ( Taiwan Earthquake) వణికించింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో 7.5 తీవ్రతతో భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ భూకంపం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 700 మందికిపైగా గాయాలపాలయ్యారు.
దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమిలో 34.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనాలు సంభావించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఆ తరువాత 6.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. కాగా పాతికేళ్లలో తైవాన్‌ను తాకిన అతిపెద్ద భూకంపం ఇదే అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. భూకంపం ప్రతాపానికి పెద్ద ఎత్తున భవనాలు ఊగిపోవడం కనిపించింది. పలు బ్రిడ్జిలు సైతం ఊగిపోయాయి. ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. నిలబడిపోయారు. బిల్డింగ్‌లు, బ్రిడ్జిలు ఊగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పాతికేళ్లలో అతిపెద్ద భూకంపం
1999 తరువాత తైవాన్ లో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదేనని ఆ దేశ అధికారులు వెల్లడించారు. అప్పుడు నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత 25 సంవత్సరాల్లో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే అని తెలిపారు.
సునామీ హెచ్చరికలు
తైవాన్ దేశంలో భారీ భూకంపం సంభవించడంతో జపాన్ సహా సమీపంలోని పలు దేశాల్లో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్ లోని దీవులకు సుమారు మూడు మీటర్ల మేర రాకాసి సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సుమారు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులు అయిన యాయామా మియాకో తీరాలను తాకినట్లు జపాన్ వెల్లడించింది. సునామీ వస్తున్నదని, ప్రజలందరూ ఇళ్లు ఖాళీ చేయాలని జపనీస్ జాతీయ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం హెచ్చరిస్తోంది. కాగా, తైవాన్‌లో 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,400 మంది ప్రజలు చనిపోయారు. ఇక జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 వరకూ భూకంపాలు నమోదైనట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి.
More footage: https://t.co/iOI1uuXcn4
— Salt Flash (@SaltFlash) April 3, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..