Friday, January 23Thank you for visiting

Tag: మమతా బెనర్జీ ఈడీ ఘర్షణ

కోల్‌కతాలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ: ఐ-ప్యాక్ దాడుల వద్ద ఉద్రిక్తత..

కోల్‌కతాలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ: ఐ-ప్యాక్ దాడుల వద్ద ఉద్రిక్తత..

Trending News
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గురువారం (జనవరి 8) హైడ్రామా చోటుచేసుకుంది. టీఎంసీ వ్యూహకర్త ప్రతీక్ జైన్.. ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.రాజకీయ వ్యూహాల కోసమే దాడులు: మమత ఆగ్రహంప్రతీక్ జైన్ నివాసం నుండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. "పార్టీ హార్డ్ డిస్క్‌లు, అభ్యర్థుల జాబితాలు, భవిష్యత్ వ్యూహాలను దొంగిలించడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇది ఈడీ పనినా లేక అమిత్ షా ప్లానా?" అని ఆమె ప్రశ్నించారు. ఇది చట్ట అమలు కాదని, కేవలం ప్రతిపక్షాల సమాచారాన్ని సేకరించే ప్రతీకార చర్య అని ఆమె ఆరోపించారు.'న్యాయాన్ని అడ్డుకుంటున్నారు' : బీజ...