
Donald Trump | భారత్ కు ట్రంప్ షాక్.. దేశంపై 25% సుంకాలు!
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మండిపడ్డారు. భారత్‌పై 2025 ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు (20% Tariff) విధించనున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. అంతేకాదు, కొన్ని అంశాల్లో భారత్ అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పంచుకున్న పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.అమెరికా సుంకాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారతదేశంపై 25% సుంకం విధించడంతోపాటు జరిమానా వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారతదేశం ఒకటి అని ట్రంప్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన పోస్ట్‌లో ఇలా రాశారు- 'గుర్తుంచుకోండి, భారతదేశం మా స్నేహితుడు కానీ...