
అగ్నిగుండంలా ఇరాన్ : 100 నగరాల్లో హింసాత్మక నిరసనలు..
ద్రవ్యోల్బణంపై ప్రజాగ్రహం.. భద్రతా దళాల కాల్పుల్లో 45 మంది మృతినిరసనకారులకు అమెరికా బాసట.. ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ హెచ్చరికఇంటర్నెట్, గగనతలం మూసివేత!Iran Protests : ఇరాన్ దేశం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పడిపోతున్న కరెన్సీ విలువకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు.. ఇప్పుడు ఏకంగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ పతనాన్ని కాంక్షించే స్థాయికి చేరుకున్నాయి. జనవరి 8 (గురువారం) రాత్రి దేశవ్యాప్తంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పరిస్థితి అదుపుతప్పింది.ప్రపంచం నుండి ఇరాన్ కట్!నిరసనకారుల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీయడానికి మరియు బాహ్య ప్రపంచానికి సమాచారం అందకుండా చేయడానికి ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు, ల్యాండ్లైన్లను నిలిపివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన మొత్తం వైమానిక ప్ర...
