Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి
Zika virus | వర్షాకాలం మొదలు కాగానే దోమలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్రమాదకరమైన జికా వైరస్ కేసులు భారత్ లో నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ వైరస్ కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని విషజ్వరాలపై నిరంతర నిఘా ఉంచాలని చెప్పింది. గర్భిణీ స్త్రీలపై దృష్టి పెట్టాలని, జికా వైరస్ సోకిన గర్భిణుల పిండం ఎదుగుదలను నిశితంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
జికా వైరస్ అంటే ఏమిటి?
1947లో ఉగాండాలో మొట్టమొదట జికా వైరస్ ను కనుగొన్నారు. ఏడెస్ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్ పేరు ఉగాండాలోని జియాకా అడవి నుంచి వచ్చింది. ఇక్కడే దీన్ని గుర్తించారు. ఇది చికున్‌గున్యా,...